- నోడల్ అధికారులకు కలెక్టర్ హరిత దిశానిర్దేశం
ఆసిఫాబాద్, వెలుగు: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నోడల్ అధికారులకు కేటాయించిన విధులు సమర్థవంతంగా నిర్వహించాలని ఆసిఫాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె.హరిత సూచించారు. శనివారం కలెక్టరేట్ లో అడిషనల్ కలెక్టర్లు దీపక్ తివారీ, ఎం.డేవిడ్, కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధాశుక్లా, ఆర్డీవో లోకేశ్వర్ రావుతో కలిసి నోడల్ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికలు విజయవంతంగా నిర్వహించడంలో నోడల్ అధికారుల పాత్ర ఎంతో కీలకమన్నారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్ ప్రింటింగ్, మీడియా సమన్వయం, సిబ్బంది శిక్షణ, మ్యాన్ పవర్, వెహికల్ కేటాయింపు, అభ్యర్థుల ఖర్చుల పరిశీలన, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు వంటి అంశాలను పటిష్టంగా అమలుచేయాలని ఆదేశించారు.
గ్రామాభివృద్ధి సర్పంచ్ల చేతుల్లోనే ఉంది
కాగజ్ నగర్, వెలుగు: గ్రామ పంచాయితీల అభివృద్ధిలో సర్పంచ్‌లదే కీరోల్ అని, నిబద్ధతతో సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలని కలెక్టర్ హరిత సూచించారు. కాగజ్ నగర్ మైనారిటీ సంక్షేమ స్కూల్లో పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో సర్పంచ్ లకు నిర్వహిస్తున్న ట్రైనింగ్ కు హాజరయ్యారు. గ్రామాల్లో పారిశుద్ధ్య పనుల్లో నిర్లక్ష్యం చేయవ ద్దని, పంచాయితీల్లో ఆదాయ వనరులు పెంచుకోవాలన్నారు.
పంచాయతీ చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని, ఇందిరమ్మ ఇండ్లు త్వరగా కట్టేలా చొరవ చూపాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి బిక్షపతి గౌడ్, సీఈఓ లక్ష్మీనారాయణ, డీఎల్పీవోలు ఉమర్ హుస్సేన్, హరిప్రసాద్, ఎంపీడీవోలు పాల్గొన్నారు.
వెనుకబడిన స్టూడెంట్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలి
టెన్త్ఎగ్జామ్స్కు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ కె.హరిత సూచించారు. శనివారం కాగజ్ నగర్ మండలం గన్నారంలోని మహాత్మా జ్యోతిబా పూలే బాలికల గురుకుల స్కూల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మెనూ ప్రకారం విద్యార్థినులకు అందిస్తున్న ఆహారం నాణ్యత, కూరగాయలు, నిత్యవసరాల నాణ్యతను పరిశీలించారు. క్లాస్‌రూమ్స్‌ను పరిశీలించి విద్యా బోధనపై ఆరా తీశారు. జడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ ఉన్నారు.
