తిర్యాణి, వెలుగు: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలంలో ఒకే కుటుంబంలో అక్కాచెల్లెళ్లు, అన్నాదమ్ములు వేర్వేరుగా సర్పంచ్అభ్యర్థులుగా నిలబడ్డారు. వీరిలో ఒకరిపై ఒకరు విజయం సాధించారు. గడలపల్లిలో అక్కాచెల్లెళ్లు ఆత్రం శంకరమ్మ, ఆత్రం విమల బరిలో నిలిచారు. శంకరమ్మ 68 ఓట్ల మెజారిటీతో చెల్లె విమలపై గెలుపొందారు. సుంగాపూర్ లో అన్నాదమ్ముళ్లు మారుతి, సురేశ్ బరిలో నిలవగా.. సురేశ్ 22 ఓట్ల మెజారిటీతో అన్న మారుతీపై గెలిచారు.
