
బాలీవుడ్ నటి పరిణీతి చోప్రాతో డేటింగ్ వార్తలపై ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా స్పందించారు. పార్లమెంటు నుంచి బయటకు వస్తు్ండగా ఆయనను ఓ విలేఖరి ఇదే విషయంపై ప్రశ్నించాడు. పరిణీతి గురించి కాదు రాజనీతి గురించి అడగండి అంటూ తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. సస్పెన్స్ ఎందుకు పెడుతున్నారని మరో ప్రశ్న వేయగా సస్పెన్స్ ఏం లేదని, తనకు పెళ్లి కుదిరితే తప్పకుండా చెబుతానని అన్నాడు. అయితే ఆ విలేఖరి అడిగిన ఈ ప్రశ్నలకు చద్దా నవ్వుతూనే సమాధానమిచ్చాడు.
ఇటీవలే ముంబైలోని ఓ రెస్టారెంట్ నుంచి పరిణీతి చోప్రాతో రాఘవ్ చద్దా బయటకు వచ్చి కారులో కలిసి బయల్దేరినట్లుగా ఓ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. 2022లో 33 సంవత్సరాల వయస్సులో రాఘవ్ చద్దా పంజాబ్ రాష్ట్రం నుంచి అతి పిన్న వయస్కుడైన పార్లమెంటు సభ్యుడిగా రాజ్యసభకు ఎంపికయ్యారు. పరిణీతి చోప్రా 24 సంవత్సరాల వయస్సులో 2011లో ‘లేడీస్ వర్సెస్ రికీ బహ్ల్’ చిత్రంతో బాలీవుడ్‌లో అరంగేట్రం చేసింది. ప్రస్తుతం ఆమె ‘చమ్కిలా’, ‘క్యాప్సూల్ గిల్’ చిత్రాలలో నటిస్తోంది.
Hehe! @raghav_chadha ? That smile.
— Mohak?? (@mohak_kohli) March 24, 2023
Aap mujhse rajneeti ke sawal kariye, Parineeti ke nahi kariye.
Video zaroor dekhiye! pic.twitter.com/CJhsUNkhP3