
బషీర్బాగ్, వెలుగు: కాంగ్రెస్ ఎన్నికల సమ యంలో ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలను అమలుచేయాలని సీఐటీయూ గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ కార్యదర్శి ఎం. వెంకటేశ్, సౌత్ సిటీ ప్రెసిడెంట్ ఎం.మీనా డిమాండ్ చేశారు. మంగళవారం ఆశా వర్కర్స్ యూనియన్(సీఐటీయూ అనుబంధం) ఆధ్వర్యంలో హైదరాబాద్ కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేశారు. లోపలికి వెళ్లేందుకు పోలీ సులు అనుమతించకపోవడంతో రోడ్డుపై బైఠాయించారు. వారు మాట్లాడుతూ ఆశా వర్కర్లకు నెలకు రూ.18 వేల జీతం ఇవ్వాలని కోరారు. డిమాండ్లు పరిష్కరించకపోతే 25న డీఎంఈ కమిషనర్ ఆఫీసును ముట్టడిస్తామని హెచ్చరించారు. కలెక్టరేట్ డీఆర్వో ఈ.వెంకటాచారికి వినతిపత్రం ఇచ్చారు. సీఐటీయూ లీడర్లు దశరథ్, ఆశా వర్కర్స్ యూనియన్ సెంట్రల్ సిటీ అధ్యక్షురాలు యాదమ్మ, భాగ్యలక్ష్మి, లత, రాణి పాల్గొన్నారు.