బెంగాల్‌‌‌‌ రీపోలింగ్‌‌‌‌లో మళ్లీ రచ్చ... మగ్రాహత్, డైమండ్ హార్బర్‌‌‌‌లోని 15 బూత్‌‌‌‌ లలో ముగిసిన పోలింగ్

బెంగాల్‌‌‌‌ రీపోలింగ్‌‌‌‌లో మళ్లీ రచ్చ... మగ్రాహత్, డైమండ్ హార్బర్‌‌‌‌లోని 15 బూత్‌‌‌‌ లలో ముగిసిన పోలింగ్

బెంగాల్‌‌‌‌ రీపోలింగ్‌‌‌‌లో మళ్లీ రచ్చ... మగ్రాహత్, డైమండ్ హార్బర్‌‌‌‌లోని 15 బూత్‌‌‌‌ లలో ముగిసిన పోలింగ్కోల్‌‌‌‌కతా: పశ్చిమ బెంగాల్‌‌‌‌లోని15 బూత్‌‌‌‌లలో శనివారం రీపోలింగ్ జరిగింది. ఉదయం 7 గంటలకు మగ్రాహత్ పశ్చిమ్ అసెంబ్లీ స్థానంలోని 11 పోలింగ్ కేంద్రాల్లో, డైమండ్ హార్బర్‌‌‌‌ అసెంబ్లీ స్థానంలోని 4 పోలింగ్ కేంద్రాల్లో భారీ భద్రత నడుమ పోలింగ్ ప్రారంభమైంది. కేంద్ర బలగాల పహారాలో ఓటర్లు మళ్లీ తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి బారులు తీరారు. 

ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ఏఎఫ్), కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) బలగాలను భారీగా మోహరించారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశలో భాగంగా ఏప్రిల్ 29న జరిగిన పోలింగ్‌‌‌‌లో అక్రమాలు జరిగినట్లు ఫిర్యాదులు వచ్చాయి. దాంతో ఎన్నికల కమిషన్ 15 బూత్‌‌‌‌లలో రీపోలింగ్ నిర్వహించాలని ఆదేశించింది. దీని ప్రకారమే శనివారం రీపోలింగ్ జరిగింది.

అక్కడక్కడ మళ్లీ ఘర్షణలు, ఉద్రిక్తతలు

ఉదయం పోలింగ్ ప్రశాంతంగా మొదలైనప్పటికీ.. ఫాల్టా పరిధిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు తమను బెదిరిస్తున్నారని, ఓటు వేయకుండా అడ్డుకుంటున్నారని స్థానిక మహిళలు, గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ముఖ్యంగా ఇస్రాఫిల్ చౌకీదార్ అనే నేత తమ ఇండ్లను తగులబెడతామని బెదిరించినట్లు బాధితులు ఆరోపించారు. 

తాము ఓటు వేయడానికి వెళ్లకుండా దారి పొడవునా అడ్డంకులు సృష్టించారని, తమ ప్రాణాలకు రక్షణ లేదని మహిళలు మీడియా ముందు కన్నీటి పర్యంతమయ్యారు.