
తెలంగాణలో తీసుకొచ్చిన పురపాలక చట్టసవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఇవాళ మంత్రి కేటీఆర్ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. పురపాలనలో ప్రతీ వ్యక్తి కేంద్ర బిందువు కావాలన్నారు. జవాబుదారీ తనంలో తక్కువ సమయంలో మెరుగైన సేవలు పొందేలా మార్పులు చేసినట్లు తెలిపారు. జులై 2019లో ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు 5 మార్పులు చేయగా.. ఎలాంటి చర్చ లేకుండా పురపాలక చట్ట సవరణ బిల్లును అసెంబ్లీ ఆమోదించింది.