అసెంబ్లీ సమావేశాలు మోడీని తిట్టడానికి, నిందలు వేయడానికే : ఎంపీ లక్ష్మణ్

అసెంబ్లీ సమావేశాలు మోడీని తిట్టడానికి, నిందలు వేయడానికే : ఎంపీ లక్ష్మణ్

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కేవలం అంకెల గారడీ మాత్రమేనని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. ఆడలేక మధ్యలో ఓడినట్టు కేంద్రంపై ఆరోపణలు చేశారన్నారు. అసెంబ్లీ సమావేశాలు కేవలం మోడీని తిట్టడానికి, బీజేపీపై నిందలు వేయడానికి మాత్రమే పెట్టుకున్నారని చెప్పారు. అసెంబ్లీలో విపక్షాలకు అధికార పార్టీ  సమయమివ్వడం లేదని తెలిపారు. 9 ఏళ్ల వార్షిక బడ్జెట్లు ఏనుగు తొండంలా.. కేటాయింపులు మాత్రం ఎలుకంత ఉన్నాయని విమర్శించారు. 

ప్రజలను భ్రమల్లోకి నెట్టేశారన్న లక్ష్మణ్... తెలంగాణలో మహిళా సంఘాలు పొదుపు చేసుకున్న సొమ్ముకు వడ్డీ లేదని చెప్పారు. రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ నాల్గవ స్థానంలో ఉందని.. కానీ ప్రభుత్వం మాత్రం ఆబ్ కి బార్ కిసాన్ సర్కార్ అంటోందన్నారు. "కేటీఆర్ తమది 4 కోట్ల కుటుంబ పాలన అంటున్నారు... నాలుగు కోట్ల మంది వాళ్ల కుటుంబం అయితే, నలుగురికి మాత్రమే మంత్రి పదవులు ఎందుకు" అని లక్ష్మణ్ ప్రశ్నించారు.