ప్రారంభమైన రాష్ట్ర అసెంబ్లీ.. మృతులకు సంతాపం

ప్రారంభమైన రాష్ట్ర అసెంబ్లీ.. మృతులకు సంతాపం

రాష్ట్ర అసెంబ్లీ ప్రారంభమైంది. రెండురోజుల పాటు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. తొలిరోజు ప్రారంభం అయిన వెంటనే.. స్పీకర్ సభలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. పలువురు మాజీ ఎమ్మెల్యేల మృతికి అసెంబ్లీ సంతాపం తెలిపింది.

పరకాల మాజీ ఎమ్మెల్యే శార రాణీ, గద్వాల మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడు, ఇందుర్తి మాజీ ఎమ్మెల్యే గట్టు వెంకటేశ్వర్, మల్కాజ్ గిరి మాజీ ఎమ్మెల్యే కనాకారెడ్డి, కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే కృష్ణ మూర్తి లకు సంతాపం తెలుపుతూ అసెంబ్లీ 2 నిమిషాలు మౌనం పాటించింది.