బంజారాహిల్స్ పెద్దమ్మ గుడి ఆలయం వద్ద ఉద్రిక్తత

బంజారాహిల్స్ పెద్దమ్మ  గుడి ఆలయం వద్ద ఉద్రిక్తత

జూబ్లీహిల్స్, వెలుగు: బంజారాహిల్స్​ఎమ్మెల్యే కాలనీలోని పెద్దమ్మ తల్లి ఆలయాన్ని కూలగొట్టిన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని మంగళవారం హిందూ ధర్మ ప్రచారకర్త రాధా మనోహర్​దాస్, సినీ నటి కరాటే కల్యాణి నిరసనకు దిగారు. ఎన్నో ఏండ్లుగా ఉన్న అమ్మవారి ఆలయం వారికి ఎందుకు అడ్డువచ్చిందని ప్రశ్నించారు. 

తక్షణమే ఆలయాన్ని తిరిగి నిర్మించాలని డిమాండ్​చేశారు. ఈ సందర్బంగా పెద్ద ఎత్తున హిందూ సంఘాలు, స్థానిక ప్రజలు ఆలయ ప్రాంగణానికి వెళ్లే ప్రయత్నం చేయగా, పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో తోపులాట జరిగి ఉద్రిక్తతకు దారి తీసింది.