
తెలంగాణ వ్యాప్తంగా ప్రజాపాలన దినోత్సవ వేడకులు జరుగుతున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు జిల్లాల్లో పాల్గొంటున్నారు. మెదక్ జిల్లా కేంద్రంలో మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ సందర్బంగా అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు మంత్రి. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడిన ఆయన.. తెలంగాణ సాయుధ పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు. నిజాం నిరంకుశ పాలనకు చరమగీతం పాడిన దొడ్డి కొమురయ్య, మల్లు స్వరాజ్యం,ఆరుట్ల, కమలాదేవీ పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు వెంకటస్వామి