
బెంగళూరు : ‘మోదీ తాత, సిద్ధరామయ్య తాత.. మన రోడ్లు ఎందుకు ఇలా ఉన్నాయి? గుంతలు పడి, రాళ్లు తేలి, బురదనే ఉన్నది. మా డాడీ, మమ్మీ ప్రభుత్వానికి ట్యాక్సులు కడుతున్నారు. పెట్రోల్, డీజిల్, కారు.. ఇలా ప్రతి దాని మీద పన్నులు చెల్లిస్తున్నారు. అయినా మన రోడ్లు ఎందుకు ఇలా ఉన్నాయి?
మోదీ తాత, సిద్ధరామయ్య తాత.. మీరెప్పుడు మన రోడ్లను బాగు చేస్తారు? మేమంతా మంచి రోడ్లు కోసం వేచి చేస్తున్నాం” అంటూ బెంగళూరులోని కనకాపురాకు దగ్గర్లోని జ్యుడీషియల్ లేఅవుట్ కాలనీకి చెందిన చిన్నారులు ప్రధానికి, సీఎంకు లెటర్ రాశారు.