HappyBirthdayModi: ప్రధాని మోడీ బర్త్ డే స్పెషల్.. వీడియోలు రిలీజ్ చేసి విష్ చేసిన టాలీవుడ్ స్టార్స్

HappyBirthdayModi: ప్రధాని మోడీ బర్త్ డే స్పెషల్.. వీడియోలు రిలీజ్ చేసి విష్ చేసిన టాలీవుడ్ స్టార్స్

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇవాళ (సెప్టెంబర్ 17న) 75వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా కార్యకర్తల నుంచి సినీ, రాజకీయ ప్రముఖుల వరకు విషెష్ చెబుతూ పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ నుంచి పలువురు సినీ స్టార్స్ ప్రధాని మోడీకి శుభాకాంక్షలు అందజేసారు.

మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేస్తూ.. ‘‘గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు. భారతదేశాన్ని పురోగతిని ఉన్నత శిఖరాల వైపు నడిపిస్తున్న మీకు మంచి ఆరోగ్యం, బలం ప్రసాదించాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను’’ అని చిరంజీవి తెలిపారు. 

అక్కినేని నాగార్జున ప్రధాని మోడీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ‘‘2014లో తొలిసారి మోడీని కలిసినప్పటి విశేషాలను వీడియో ద్వారా పంచుకున్నారు. ఇందులో మోడీ తన వ్యక్తిగత జీవితాన్నీ దేశం కోసం త్యాగం చేశారని నాగార్జున అన్నారు. ఈ సందర్భంగా సినీ లెజెండ్స్‌లో ANR ఒకరంటూ ‘మన్‌ కీ బాత్‌’ లో మోడీ ప్రస్తావించడం ఆనందంగా ఉందని’’ నాగార్జున తెలిపారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు వీడియో రిలీజ్ చేసి ప్రధాని మోడీకి శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘ మన గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఎల్లప్పుడూ మంచి ఆరోగ్యం, ఆనందంతో ఉండాలని మరియు మీ నాయకత్వంతో మా అందరికీ స్ఫూర్తినిస్తూ ఉండాలని కోరుకుంటున్నానని’’ మహేష్ ట్వీట్ చేశారు. 

►ALSO READ | War 2 OTT: ఓటీటీలోకి ఎన్టీఆర్ ‘వార్ 2’.. స్ట్రీమింగ్ డేట్పై లేటెస్ట్ అప్డేట్!

టాలీవుడ్ దిగ్గజ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి ప్రధాని మోడీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఓ వీడియో రిలీజ్ చేసి తన అభిప్రాయం పంచుకున్నారు. ‘‘మన గౌరవనీయ ప్రధానమంత్రి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఎల్లప్పుడూ మంచి ఆరోగ్యం, శక్తి మరియు ఆనందాన్ని పొందాలని కోరుకుంటున్నానని" జక్కన్న తెలిపారు.

జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తూ.. ‘‘అత్యంత శ్రద్ధాసక్తుడు మరియు అంకితభావం కలిగిన భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మన గర్వించదగ్గ దేశాన్ని మెరుగుపరచడానికి మీ అవిశ్రాంత ప్రయత్నాలు ఎల్లప్పుడూ ప్రకాశవంతంగా వెలుగుతాయని’’ ఎన్టీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. బాలీవుడ్ నుంచి సూపర్ స్టార్స్ షారుఖ్ ఖాన్, అమిర్ ఖాన్ సైతం ప్రధానమంత్రి మోడీకి బర్త్ డే విషెస్ అందజేశారు.