ఉదయం 8.37కి సిక్ లీవ్ మెసేజ్.. 8.47కి చనిపోయాడు : కన్నీళ్లు తెప్పిస్తున్న ఆఫీస్ బాస్ ఆవేదన

ఉదయం 8.37కి సిక్ లీవ్ మెసేజ్.. 8.47కి చనిపోయాడు : కన్నీళ్లు తెప్పిస్తున్న ఆఫీస్ బాస్ ఆవేదన

40 ఏళ్ల ఉద్యోగి.. పెళ్లయ్యింది.. ఓ బిడ్డ.. మంచి కంపెనీలో ఉద్యోగం.. సిగరెట్ తాగడు.. మందు ముట్టడు.. క్రమశిక్షణకు మారుపేరు.. ఎప్పటిలాగే ఉదయాన్నే నిద్ర లేచాడు.. అన్ ఈజీగా ఫీలయ్యాడు.. ఉదయం సరిగ్గా 8 గంటల 37 నిమిషాలకు ఆఫీసులోని తన బాస్ కు మెసేజ్ పెట్టాడు.. ఆరోగ్యం బాగోలేదు ఈ రోజు సిక్ లీవ్ తీసుకుంటా అని.. సరిగ్గా ఉదయం 8 గంటల 47 నిమిషాలకు అతను చనిపోయాడు.. ఫ్యామిలీనే కాదు.. ఆఫీసులోని బాస్ షాక్.. పది నిమిషాల్లోనే ఇలా జరగటాన్ని జీర్ణించుకోలేకుండా ఉన్నారు.. 

ఆరేళ్లుగా కంపెనీలో పని చేస్తున్నాడు.. అతని మెసేజ్ ను సాధారణంగానే భావించాను.. ఓకే సెలవు తీసుకోండి అని మెసేజ్ చేశాను.. నా మెసేజ్ అతను చదివాడో లేదో కూడా నాకు తెలియదు.. అంతలోనే అతను లేడు అని నాకు మెసేజ్ వచ్చింది.. ఈ విషయాన్ని జీర్ణించుకోలేకుండా ఉన్నాను అంటూ ఉద్యోగి బాస్ భావోద్వేగంతో తన అనుభావాన్ని పంచుకోవటం అందరినీ ఆవేదనకు గురి చేస్తుంది

ఒంట్లో బాగోనప్పుడు అత్యవసరంగా తమ యజమాని లేదా సీనియర్లకు సమాచారం ఇచ్చి లీవ్ తీసుకోవటం సర్వ సాధారణం. కానీ ఒక ఉద్యోగి తనకు ఒంట్లో బాలేదని మెసేజ్ చేసి సెలవు కోరిన కొన్ని నిమిషాల్లోనే మరణించటం సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన వివరాలను ఆ ఉద్యోగి యజమాని సోషల్ మీడియాలో పంచుకోవటం చాలా మందిని బాధకు గురిచేస్తోంది. 

శంకర్ అనే 40 ఏళ్ల ఉద్యోగి తనకు బాలేదని ఎక్కువగా నడుం నొప్పిగా ఉండటంతో తన మేనేజర్ కేవి ఐయ్యర్ కి ఉదయం 8.37కి మెసేజ్ చేశాడు. తాను ఈరోజు పనికి రాలేకపోతున్నానని, తనకు సిక్ లీవ్ కావాలని అందులో కోరాడు. ఇలాంటివి సహజంగా జరుగుతుంటాయి కాబట్టి అలాగే రెస్ట్ తీసుకోమని మేనేజర్ బదులిచ్చాడు. అయితే ఇది జరిగిన కేవలం 10 నిమిషాల్లోనే శంకర్ కార్డియాక్ అరెస్ట్ కారణంగా కుప్పకూలిపోయాడు. సదరు ఉద్యోగి తమ కంపెనీలో 6 ఏళ్ల నుంచి పనిచేస్తున్నట్లు ఐయ్యర్ చెప్పారు. అతనికి వివాహం అయ్యిందని చిన్న పిల్లలు కూడా ఉన్నారని, శంకర్ ఆరోగ్యకరమైన అలవాట్లతో ఫిట్ గా ఉన్నప్పటికీ అకాలంగా మరణించటం దిగ్భ్రాంతికి గురిచేసిందని ఐయ్యర్ అన్నారు. 

సెలవు కోరిన తర్వాత అంతా సర్థుకుంటుందని తాను భావించానని అయితే 11 గంటలకు వచ్చిన కాల్ తనను పూర్తిగా షాక్ కి గురిచేసిందని మేనేజర్ ఐయ్యర్ చెప్పారు. విషయం తెలిసినవెంటనే సదరు ఉద్యోగి ఇంటికి వెళ్లానని, అతని మరణించినట్లు తెలిసి అస్సలు నమ్మలేకపోయినట్లు ఐయ్యర్ చెప్పారు. అయితే ఐయ్యర్ చేసిన పోస్టుపై నెటిజన్లు స్పందిస్తూ ఇంత చిన్న వయస్సులో సదరు ఉద్యోగి మరణించటం అతనికి చిన్న పిల్లలు ఉండటం బాధాకరమని అన్నారు. మరో వ్యక్తి కార్డియాక్ అరెస్ట్ సమయంలో ఏ మందులూ కాపాడలేవని అది హటాత్తుగా జరిగే పరిణామంగా మరో వ్యక్తి చెప్పారు. 

►ALSO READ | ఇండియన్ పాస్ పోర్టు నాలుగు రంగులలో.. ఒక్కో రంగుకు ఒక్కో అర్థం.. తప్పకుండా తెలుసుకోవాల్సిందే !