
విదేశాల్లో చదవాలనుకున్నా.. అలా టూర్ వెళ్లి రావాలనుకున్నా.. లేదా ఉద్యోగం, వ్యాపారం చేయాలనుకున్నా.. దేశాన్ని దాటించి ఇబ్బందులు లేకుండా కాపాడే ఏకైక అధికారిక గుర్తింపు కార్డు పాస్ పోర్టు. ఇండియన్ పాస్ పోర్టు బ్లూ కలర్ లో ఉంటుందని అందరిలో ఉన్న అవగాహన. కానీ బ్లూ ఒక్కటే కాదు.. ఇండియాలో నాలుగు రకాల పాస్ పోర్టులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో కలర్ పాస్ పోర్టు వెనుక ఒక్కో అర్థం దాగి ఉంది. కలర్ వెనుక పర్పస్ కూడా వేరే ఉంది అదేంటో తెలుసుకుందాం.
1. బ్లూ పాస్ పోర్టు:
ఇది రెగ్యులర్ గా అందిరికీ తెలిసిన.. ఎక్కువ మందికి జారీ చేసే ఆర్డినరీ పాస్ పోర్టు. విద్య, ఉద్యోగం, టూర్, వ్యాపారం తదితర అవసరాల మేరకు ఈ బ్లూ పాస్ పోర్టు జారీ చేస్తుంటారు. లక్షల మంది భారతీయుల దగ్గర ఈ పాస్ పోర్టు ఉంటుంది. ఇప్పుడు ఇది e-passport రూపలో కూడా అందుబాటులో ఉంది.
ఎవరు అర్హులు:
ఈ కామన్ పాస్ పోర్టు కావాలంటే ఇండియన్ సిటిజన్ అయ్యుండాలి. ఇండియాలో పుట్టి ఉండాలి. దీని కోసం ఆధార్, పాన్ కార్డు, అడ్రెస్ ప్రూఫ్, బర్త్ ప్రూఫ్ అవసరం. సమీప పాస్ పోర్టు కేంద్రంలో అప్లై చేసుకుంటే పోలీస్ వెరిఫికేషన్ తర్వాత అర్హులైతే జారీ చేస్తారు.
2. వైట్ పాస్ పోర్టు:
తెల్ల రంగులో ఉండే ఈ పాస్ పోర్టు ప్రభుత్వ ఉద్యోగులకు జారీ చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగులు, సివిల్ సర్వెంట్స్, సైనిక బలగాలకు ఇది మంజూరు చేస్తారు. అఫ్పీషియల్ కెపాసిటీ ఉంటుందని ఈ కలర్ కు అర్థం. ఈ పాస్ పోర్టు ఉంటే ఇమిగ్రేషన్ ప్రాసెస్ చాలా వ వేగవంతంగా పూర్తవుతుంది.
3. రెడ్ లేదా మెరూన్ పాస్ పోర్టు:
ఎరుపు రంగు లేదా మెరూన్ కలర్ లో ఉండే ఈ పాస్ పోర్టును డిప్లొమాటిక్ సేవలకు.. అంటే విదేశాలతో దౌత్య సంబంధాలు నిర్వహించే అధికారులు, ఫారెన్ సర్వీసెస్ అధికారులు (గ్రూప్ A), విదేశాంగ శాఖలో పనిచేస్తున్న అధికారులు (గ్రూప్ B) సీనియర్ గవర్నమెంటు అధికారులు, వారి కుటుంబ సభ్యులకు మంజూరు చేస్తారు. విదేశఆల్లో పనిచేసే అధికారులతో పాటు భారత దౌత్య సంబంధాల్లో భాగంగా విదేశాల్లో నివసిస్తున్న అధికారులకు ఈ పాస్ పోర్టు ఇస్తారు.
4. ఆరెంజ్ పాస్ పోర్టు:
ఆరెంజ్ పాస్ పోర్టును 2018 నుంచి జారీ చేయడం లేదు. 10 వ తరగతి మించి విద్యార్హత లేని వాళ్లకు ఈ పాస్ పోర్టు ఇచ్చేవారు. ఆరెంజ్ పాస్ పోర్టు ఇస్తున్నారంటే.. ఆ అభ్యర్థుల విషయంలో మరిన్ని చెకప్స్ అవసరమని సూచించడం.
►ALSO READ | ఇన్ కం ట్యాక్స్ అధికారులు అంటూ డాక్టర్ ఇంట్లో దోపిడీ : హీరో సూర్య గ్యాంగ్ మూవీ తరహాలో రియల్ సీన్
అయితే ఆరెంజ్ కలర్ ఇవ్వడం ద్వారా డిస్క్రిమినేట్ చేస్తున్నారని.. చదవు విద్యార్హతలు వెంటనే తెలిసిపోవడం ద్వారా వారు ఆత్మన్యూనతకు గురవుతున్నారనే విమర్శలు వచ్చాయి. దీంతో ఈ కలర్ పాస్ పోర్టును ప్రభుత్వం విత్ డ్రా చేసుకుంది.
e పాస్ పోర్టుతో చాలా ఈజీ:
భారత ప్రభుత్వం లేటెస్ట్ గా ఇ-పాస్ పోర్టును అందుబాటులోకి తెచ్చింది. ఇది రెగ్యులర్ పాస్ పోర్టులా కాకుండా మైక్రో చిప్ తో పనిచేస్తుంది. ఇమిగ్రేషన్ టైమ్ లో చాలా తొందరగా వెరిఫికేషన్ పూర్తవుతుంది. అదే విధంగా ఫోర్జరీ చేయడానికి కూడా వీలుకాకుండా ఉంటుంది.
ఏ ఏ దేశాల్లో ఏ కలర్లో ఉంటాయి?
పాస్ పోర్టులు ఒక్కో దేశ ఒక్కో కలర్ ను ప్రెఫర్ చేస్తుంటాయి. యూరోపియన్ దేశాల పాస్ పోర్టు కవర్ రెడ్ కవర్ లో ఉంటుంది. ఇస్లామిక్ దేశాల పాస్ పోర్టు గ్రీన్ కలర్లో ఉంటాయి. కొన్ని ఆఫ్రికన్ దేశాలు బ్లాక్ కలర్ కు ప్రాధాన్యమిస్తాయి. ఇండియాలో ప్రస్తుతం బ్లూ, రెడ్, వైట్ కలర్ లో పాస్ పోర్టులు అందుబాటులో ఉన్నాయి.