వెదురుసాగుతో దీర్ఘకాలిక ఆదాయం : డీపీఎం సమ్మక్క

వెదురుసాగుతో దీర్ఘకాలిక ఆదాయం : డీపీఎం సమ్మక్క

చండ్రుగొండ, వెలుగు: వెదురు సాగుతో 40 ఏండ్ల వరకు దీర్ఘకాలిక ఆదాయం పొందవచ్చని డీపీఎం సమ్మక్క తెలిపారు. మంగళవారం మండలంలోని తిప్పనపల్లి, పోకలగూడెం, బెండాలపాడు గ్రామాల్లో రైతులకు వెదురు సాగుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు తమ వ్యవసాయ భూమిలో 15 కుంటల నుంచి ఎకరం వరకు వెదురు మొక్కలను పెంచుకోవచ్చన్నారు.

 నాలుగు ఏండ్ల నుంచి దిగుబడి లభిస్తుందని తెలిపారు. మండలంలో వెదురు సాగు విస్తీర్ణం పెంచేందుకు రైతులు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏపీఎం శ్రీనివాసరావు, రిసోర్స్ పర్సన్ అక్షయ్, సీసీలు నగేశ్, రాజేందర్, మల్సూర్ తదితరులు పాల్గొన్నారు.