
కిరీటి రెడ్డి, శ్రీలీల, జెనీలియా నటించిన కన్నడ/తెలుగు ద్విభాషా చిత్రం జూనియర్ (Junior).జులై 18న థియేటర్లలో రిలీజైన జూనియర్ ఓటీటీలోకి వచ్చేస్తుంది. సాంగ్స్తో భారీ హైప్ ఇచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మాత్రం మోస్తరు వసూళ్లతో సరిపెట్టుకుంది. శ్రీలీలతోపాటు జెనీలియా రీఎంట్రీ బాగుందని రివ్యూలు వచ్చినప్పటికీ.. కలెక్షన్లలో మాత్రం రాణించలేకపోయింది.
వసూళ్ల దృష్ట్యా.. జూనియర్ థియేటర్ లాంగ్ రన్ అలోమోస్ట్ కంప్లీట్ చేసుకుందనే టాక్ ట్రేడ్ వర్గాల నుంచి వినిపిస్తోంది. ఈ క్రమంలో రిలీజైన రెండు వారాల్లోనే మూవీ ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం. శనివారం (ఆగస్ట్ 2) నుంచే ప్రైమ్ వీడియోలోకి స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. అయితే, స్ట్రీమింగ్ విషయంపై మేకర్స్ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.
నిజానికి జూనియర్ మూవీని మొదట ఆగస్ట్ 15 నుంచి స్ట్రీమింగ్ చేయాలనీ మేకర్స్ భావించారు. కానీ, జూనియర్ పై ఉన్న క్రేజీ బజ్ ఆడియన్స్ మరిచిపోకముందే.. ఓటీటీకి తీసుకురావాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇవాళ లేదా రేపటిలోపు జూనియర్ ఓటీటీపై మేకర్స్ నుంచి అప్డేట్ వచ్చే అవకాశం ఉంది.
జూనియర్ బడ్జెట్ & కలెక్షన్లు:
జూనియర్ మూవీ ప్రమోషన్ ఖర్చుతో కలిపి మొత్తం రూ.25 కోట్ల బడ్జెట్ తో నిర్మించబడింది. శ్రీలీల, కిరిటీ క్రేజీ దృష్ట్యా రూ.10 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది. దానికితోడు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1100 స్క్రీన్లలో విడుదలైంది.
ఆంధ్రప్రదేశ్/తెలంగాణలో 500 స్క్రీన్లలో, ఇండియా వైడ్ గా 900 స్క్రీన్లలో మరియు ఓవర్సీస్లో 200 స్క్రీన్లలో గ్రాండ్ గా రిలీజయ్యింది. ఈ క్రమంలో భారీ వసూళ్లు సాధిస్తుందని అంచనా వేశాయి ట్రేడ్ వర్గాలు. కానీ, సినిమా మిక్సెడ్ టాక్ అందుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా 10 కోట్లకి పైగా గ్రాస్ సాధించింది.ఇండియాలో రూ.7 కోట్లకి పైగా నెట్ వసూళ్లు చేసింది.
►ALSO READ | 90s Stars Reunite: 90'sల్లో వెండితెరను ఏలిన సినీ స్టార్స్.. గోవాలో మళ్లీ కలిశారు.. వారెవరో చూసేయండి
ఇదిలా ఉంటే.. జూనియర్ కథలో కొత్తదనం కనిపించదు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలానే ఉంటుంది. బడా ఫ్యామిలీ నుంచే వచ్చే హీరోను పరిచయం చేసే సినిమాకు ఉండాల్సిన అన్ని కమర్షియల్ హంగులు ఇందులో ఉన్నాయి. అయితే, టాలీవుడ్లో వచ్చినా పాత ఫార్ములా కథనే కొత్తగా చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు డైరెక్టర్.
ఫాదర్- సన్, బ్రదర్-సిస్టర్, ఫాదర్-డాటర్ అంశాలతో కథ రాసుకున్నాడు డైరెక్టర్. ఇంకో విషయం చెప్పాలంటే.. సినిమాచూసే కొద్దీ.. స్టోరీ రోటీన్ అనిపించినప్పటికీ.. కామెడీ, ఎమోషన్, యాక్షన్, లవ్ ట్రాక్ వర్కౌట్ అయ్యాయి. ఆడియన్స్ను ఎక్కడా బోర్ కొట్టకుండా చేశాయి. ఫస్టాఫ్ మొత్తం హీరో హుషారైన డాన్స్, హీరోయిన్తో లవ్ ట్రాక్, సత్య, హర్షతో కామెడీ వంటి సీన్స్ ఆకట్టుకుంటాయి.
కథేంటంటే:
విజయనగరానికి చెందిన ఒక మిడిల్ క్లాస్ మనిషి కోదండపాణి (రవిచంద్రన్). అతని భార్య శ్యామల. వీరిద్దరికీ 60 ఏళ్ల వయసులో కొడుకు పుడతాడు. శ్యామల తన బిడ్డకు జన్మనిచ్చే క్రమంలో కన్నుమూస్తుంది. తల్లిలేని అభికి (కిరీటి రెడ్డి) సర్వం తానై పెంచి పెద్ద చేస్తాడు కోదండపాణి. ఈ క్రమంలో అభిపై తండ్రి కోదండపాణి వీపరీతమైన ప్రేమను చూపిస్తాడు. తన తండ్రి చూపించే ప్రేమ మూలంగా చిన్న చిన్న సరదాలు దూరమవుతున్నాయని అభి భావిస్తాడు.
‘అరవయ్యేళ్లొచ్చాక మనకంటూ చెప్పుకోవడానికి కొన్ని జ్ఞాపకాలు ఉండాలి కదా’అనేది అతని సిద్ధాంతం. ఈ క్రమంలో తండ్రి ప్రేమను తట్టుకోలేని అభి సిటీకి వెళ్లి కాలేజ్‌లో జాయిన్ అవుతాడు. అక్కడ స్ఫూర్తిని (శ్రీలీల) ఇష్టపడి ఆమె పని చేసే కంపెనీలో ఉద్యోగంలో చేరుతాడు. ఆ కంపెనీ CEOఅయిన విజయ సౌజన్య (జెనీలియా)కు అభి అంటే పడదు.
అసలు విజయ సౌజన్యతో కిరీటికి మధ్య గొడవ ఏంటీది? విజయ సౌజన్య ఎవరు? ఆమెకు విజయనగరం అంటే ఎందుకు నచ్చదు? అలాంటి ఊరికి అభితోనే కలిసి సౌజన్య ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? కోదండ పాణికి, విజయ సౌజన్యకు మధ్య ఉన్న రిలేషన్ ఏంటీ? కోదండపాణి ఊరు నుండి సిటీ ఎందుకు రావాల్సి వచ్చింది? కిరిటీ ప్రేమించిన స్ఫూర్తి కథేంటీ? అనేది మిగతా కథ.