90s Stars Reunite: 90'sల్లో వెండితెరను ఏలిన సినీ స్టార్స్.. గోవాలో మళ్లీ కలిశారు.. వారెవరో చూసేయండి

90s Stars Reunite: 90'sల్లో వెండితెరను ఏలిన సినీ స్టార్స్.. గోవాలో మళ్లీ కలిశారు.. వారెవరో చూసేయండి

సినిమా అనేది చక్కని ప్రయాణం. ఈ ప్రయాణంలో స్థానం సంపాదించుకోవడానికి ఎన్నో కష్టాలు పడుతూ వస్తాం. ఇక్కడికి వచ్చాకా అందులో కొన్ని విజయాలు, మరికొన్ని ఓటములు ఎదురువుతాయి. ఇవి ఎవరికైన కామన్. కానీ, ఈ సినీ ప్రయాణం ఎలా ఉన్నా.. చివరికి మంచి అనుభూతుల్ని, జ్ఞాపకాల్ని తిరిగి ఇవ్వాలి. ఇదే అల్టిమేట్. ఎందుకంటే.. కొంతకాలం గడిచాక.. తిరిగి వెనక్కి చూసుకుంటే అవి జ్ఞాపకాలుగా మనల్ని తట్టి లేపుతుంటాయి. ఆనాటి కో స్టార్ని మళ్ళీ కలవాలి, ఆ వర్సటైల్ డైరెక్టర్తో మరోసారి మాట్లాడాలి.. వంటి క్షణాలు ఎప్పుడూ గుర్తొస్తాయి. ఈ తరహా ఫీలింగే.. స్నేహం. అదే మధురం. ఇపుడీ ఇదంతా ఎందుకంటే..ఆడియన్స్ను నవ్వించినా ఆనాటి సినీ స్టార్స్ మళ్ళీ ఒకచోట కలుసుకున్నారు. వారెవరో ఓ సారి లుక్కేయండి.  

90వ దశకంలో వెండితెరను ఏలిన సినీ స్టార్స్ మరోసారి కలుసుకున్నారు. తెలుగు, తమిళ భాషల్లో హీరోహీరోయిన్, డైరెక్టర్లుగా చేసిన పలువురు గోవాలో హ్యాపీగా పార్టీ చేసుకున్నారు.

వీరిలో జగపతి బాబు, శ్రీకాంత్, దర్శకులు శంకర్, మోహన్ రాజా, కె.ఎస్. రవికుమార్, లింగుసామి, ప్రభుదేవా తదితరులు ఉన్నారు. హీరోయిన్స్ లలో సిమ్రాన్, సంగీత, సంఘవి, శ్వేతా మీనన్, మీనా, మాళవిక, రీమా సేన్, మహేశ్వరి మరియు శివరంజని తదితరులు ఉన్నారు.

ALSO READ | Payal Rajput: టాలీవుడ్ హీరోయిన్ ఇంట్లో తీవ్ర విషాదం.. రెండ్రోజుల తర్వాత వెలుగులోకి

వీళ్లు సందడిగా చేసిన పార్టీ ఫొటోల్ని తమ తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీరి ఆనందకరమైన కలయికలో తమ అలనాటి జ్ఞాపకాలను షేర్ చేసుకున్నారు. బీచ్‌సైడ్, డిన్నర్, వంటి పలు ఈవెంట్ ఫొటోస్ లలో కనిపించి ముచ్చటపెంచారు.

వీరి దశాబ్దాల స్నేహాన్ని మరియు సినిమా లైఫ్ని గుర్తుచేసుకుంటూ హ్యాపీ క్షణాలను సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలో వీరి  ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో తమ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. తమ అభిమాన తారలను మరోసారి కలిసి చూడటం పట్ల అభిమానులు ఎంతో ఆనందంగా ఉన్నామంటూ కామెంట్లు పెడుతున్నారు.