
టాలీవుడ్ హీరోయిన్ రాజ్‌పుత్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆమె తండ్రి విమల్ కుమార్ రాజ్‌పుత్ (67) కన్నుమూశారు. కొంతకాలం నుంచి క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన జులై 28న మరణించారు. అయితే, ఈ విషయాన్ని ఆలస్యంగా పాయల్ తన ఇంస్టాగ్రామ్ వేదికగా వెల్లడించింది. క్యాన్సర్‌తో పోరాడుతున్న తన తండ్రి కోసం చాలా పోరాటం చేశానని.. కానీ, తన నాన్నను కాపాడే పోరాటంలో విజయం సాధించలేకపోయానని ఆమె పోస్ట్ ద్వారా తెలిపింది.
‘మీరు నా పక్కన లేకపోయినా, మీ ప్రేమ నన్ను నడిపిస్తుంది. మీ చిరునవ్వు, మీ గొంతు, మీ ఉనికి నాకు గుర్తుంది. మీరు ఈ లోకాన్ని వదిలి వెళ్ళిన, నా హృదయంలో ఎప్పటికీ ఉంటారు. లవ్ యు నాన్న.. నేను మిమ్మల్ని మళ్ళీ చూస్తానని’ ఎమోషనల్ పదాలతో పాయల్ ట్వీట్ చేసింది.
►ALSO READ | బుజ్జిగాడు బాండింగ్.. మరోసారి కాంబినేషన్ కుదిరేనా
ఈ పోస్ట్ సినీ ప్రముఖులను, తన ఫ్యాన్స్ను కలిచివేస్తుంది. ఈ క్రమంలో పాయల్ ధైర్యంగా ఉండాలని కోరుతూ పోస్టులు పెడుతున్నారు. ఇవాళ (జూలై 30న) కుటుంబ సభ్యుల సమక్షంలో విమల్ కుమార్ అంత్యక్రియలు ఢిల్లీలో నిర్వహించనున్నారు.
పాయల్ రాజ్‌పుత్ పేరు వినగానే ఆర్‌ఎక్స్ 100, మంగళవారం, వెంకీ మామ వంటి చిత్రాలు గుర్తొస్తాయి. ఓ వైపు గ్లామర్, మరోవైపు తన నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన పాయల్.. గత ఏడాది రక్షణ, గోల్‌మాల్, ఏంజెల్, కిరాతక చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ముని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వెంకటలచ్చిమి’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.