బుజ్జిగాడు బాండింగ్.. మరోసారి కాంబినేషన్ కుదిరేనా

బుజ్జిగాడు బాండింగ్.. మరోసారి కాంబినేషన్ కుదిరేనా

ప్రభాస్, పూరి జగన్నాథ్‌‌ల బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చాలా సంవత్సరాల  తర్వాత మళ్లీ వీరిద్దరూ కలిశారు.  ప్రభాస్ నటిస్తున్న ‘రాజా సాబ్’  సెట్‌‌లో పూరి ప్రత్యక్షమయ్యారు. దీంతో వీరిద్దరు కాసేపు కలిసి ముచ్చటించుకున్నారు. విజయ్ సేతుపతి హీరోగా పూరి జగన్నాథ్  ఓ మూవీ  తెరకెక్కిస్తుండగా, ‘రాజా సాబ్’ సెట్‌‌కు దగ్గరలోనే ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. 

విషయం తెలుసుకున్న పూరి వెంటనే ప్రభాస్‌‌ను కలవడానికి వెళ్లారు. ఆయనపై ఉన్న అభిమానంతో పూరి జగన్నాథ్‌‌ను గట్టిగా హగ్ చేసుకున్నాడు ప్రభాస్.  ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌‌ అవుతున్నాయి.  వీరి కాంబోలో రూపొందిన బుజ్జిగాడు, ఏక్‌ నిరంజన్ చిత్రాల్లో ప్రభాస్ ఎనర్జిటిక్‌‌గా కనిపిస్తాడు.  దీంతో మరోసారి ఈ క్రేజీ కాంబోపై అందరి దృష్టి పడింది.