యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ విద్యార్థికి .. మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రశంసలు

యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ విద్యార్థికి .. మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రశంసలు

ముషీరాబాద్ వెలుగు : బాగ్​లింగంపల్లిలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కాలేజీకి చెందిన కృష్ణ కిరణ్, భగత్ సింగ్ యూపీఎస్సీ సివిల్స్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షల్లో విజయం సాధించారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి బుధవారం వారిని ప్రశంసిస్తూ సత్కరించారు. బాగా చదివి రాబోయే మెయిన్స్ పరీక్షల్లో విజయం సాధించాలని ఆకాంక్షించారు.

 నిరంతరం ముందుకు సాగడానికి తమ పూర్తి మద్దతు ఉంటుందన్నారు. పట్టుదలతో ముందుకు వెళ్తే విజయాలు వరిస్తాయన్నారు.