
ఆసియా కప్ లో టీమిండియా దెబ్బకు పాకిస్థాన్ సంచలన నిర్ణయం తీసుకోనుందనే వార్తలు వస్తున్నాయి. ఆసియా కప్ నుంచి వైదొలిగే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఆదివారం (సెప్టెంబర్ 14) ఆసియా కప్ లీగ్ మ్యాచ్ లో ఇండియా చేతిలో పాకిస్థాన్ చిత్తుగా ఓడిపోయింది. మ్యాచ్ తర్వాత టీమిండియా క్రికెటర్లు పాకిస్థాన్ జట్టుకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ఆసక్తి చూపించలేదు. సూర్య విన్నింగ్ షాట్ కొట్టి తర్వాత షేక్ హ్యాండ్ ఇవ్వకుండా వెంటనే దూబేతో కలిసి డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్ళిపోయాడు. అంతేకాదు పాక్ ప్లేయర్ల ముఖం చూడకుండా డ్రెస్సింగ్ రూమ్ తలుపు వేసుకున్నారు.
టీమిండియా షేక్ హ్యాండ్ ఇవ్వనందుకున పాకిస్థాన్ క్రికెట్ తీవ్ర కోపంతో రగిలిపోయింది. ఇండియా ఆటగాళ్ల ప్రవర్తన, మ్యాచ్ రిఫరీ వైఖరిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న పీసీబీ ఈ వివాదంపై ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కి ఫిర్యాదు చేసింది. అయితే పాక్ ప్రయత్నం ఫలించలేదు. వారు చేసిన ఫిర్యాదును ఐసీసీ కొట్టిపారేసింది. షేక్ హ్యాండ్ ఖచ్చితంగా ఇవ్వాలనే రూల్ లేదని ఐసీసీ పాక్ క్రికెట్ క్రికెట్ బోర్డుకు చెప్పినట్టు సమాచారం. రిఫరీని తొలగించకపోతే ఆసియా కప్ నుంచి వైదొలుగుతామన్న పాకిస్థాన్ ఆ దిశగా అడుగులు వేసి షాక్ ఇస్తుంది.
ప్రెస్ కాన్ఫరెన్స్ కు హాజరు కాని పాకిస్థాన్:
సల్మాన్ అలీ ఆఘా కెప్టెన్సీలోని పాకిస్థాన్ జట్టు బుధవారం (సెప్టెంబర్ 17) యూఏఈతో మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్ పై పాకిస్థాన్ ఆసక్తి చూపించట్లేదట. ఇందులో భాగంగా మంగళవారం (సెప్టెంబర్ 16) విలేకరుల సమావేశాన్ని రద్దు చేసుకున్నారు. దుబాయ్‌లో ఉన్న జర్నలిస్టుల నుండి వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం పాకిస్తాన్ జట్టు భారత కాలమానం ప్రకారం రాత్రి 9.30 గంటలకు జరగాల్సిన ప్రెస్ కాన్ఫరెన్స్ కు హాజరు కావడానికి నిరాకరించింది. ఒకవేళ పాకిస్థాన్ యూఏఈతో మ్యాచ్ ఆడకపోతే టోర్నీ నుంచి నిష్క్రమిస్తోంది. అప్పుడు గ్రూప్- ఏ నుంచి ఇండియా, యూఏఈ సూపర్-4 కు అర్హత సాధిస్తాయి.
ALSO READ : అంతా తూచ్.. ఇండియాను నేను ఏం అనలే: షేక్ హ్యాండ్ వివాదంపై రికీ పాంటింగ్ క్లారిటీ
పాకిస్థాన్ టోర్నీ నుంచి తప్పుకుంటే మాత్రమే వారికి ఆర్ధికంగా చాలా నష్టం వాటిల్లే ప్రమాదముంది. 7% ఆదాయాన్ని కోల్పోవాల్సి వస్తోంది. అంటే $12 నుండి $16 మిలియన్ల ఆదాయాన్ని నష్టపోనున్నారు. రిఫరీని తొలగించకపోతే ఆసియా కప్ నుంచి స్కిప్ అవుతామని ప్రకటించిన పాక్.. బుధవారం మ్యాచ్ ఆడుతుందా లేక.. బెట్టుకు పోయి ఆడకుండా అంతర్జాతీయ స్థాయిలో పరువు పోగొట్టుకుంటుందా చూడాలి. ఈ టోర్నీలో ఇప్పటివరకు రెండు మ్యాచ్ లాడిన పాకిస్థాన్ తొలి మ్యాచ్ లో ఒమన్ పై 93 పరుగుల తేడాతో విజయం సాధించారు. ఆ తర్వాత ఇండియాతో జరిగిన మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో ఓడిపోయారు.