ఒకే కాలనీ..ఉన్నది 25 ఇండ్లు..కులానికో బోర్డు

ఒకే కాలనీ..ఉన్నది 25 ఇండ్లు..కులానికో బోర్డు

గజ్వేల్, వెలుగు: ఆ కాలనీలో ఉన్నదే 25 ఇండ్లు. మొదటి నుంచీ ‘వినాయక నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ అని పిలుస్తున్న ఆ కాలనీ ఎదుట.. ఇటీవల కులానికి ఒకటి చొప్పున మరో ఐదు బోర్డులు ప్రత్యక్షం అయ్యాయి. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సమీపంలో ముట్రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి రోడ్డు పక్కన ఇటీవల ఓ కాలనీ ఏర్పడింది.

 ఇక్కడ ఒకే సామాజికవర్గానికి చెందిన కుటుంబాలు 70 శాతం ఉండగా.. మిగిలిన సామాజిక వర్గాలకు చెందిన కుటుంబాలు 30 శాతం ఉన్నాయి. కాలనీ ఏర్పాటైన కొత్తలో అందరూ కలిసి ‘వినాయక నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ అని పేరు పెట్టుకున్నారు. కానీ ఇటీవల ఏమైందో తెలియదు కానీ.. కాలనీలో మెజార్టీగా ఉన్న కుటుంబాల వారు తమ కులం పేరుతో కాలనీ మొదట్లో ఓ బోర్డు ఏర్పాటు చేశారు. ఈ బోర్డుపై మిగతా కులాల వారు అభ్యంతరం వ్యక్తం చేసినా ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. దీంతో ఎవరికి వారుగా... రెడ్డి, ఆర్యవైశ్య, ముదిరాజ్, విశ్వకర్మ, యాదవ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్లేవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేరుతో బోర్డులు ఏర్పాటు చేసేశారు. ఒకే కాలనీకి ఇలా ఆరు పేర్లతో బోర్డులు ఏర్పాటు కావడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.