
బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ షో మొదలైందంటే చాలు సీరియల్స్, సినిమాలు సైతం పక్కన పెట్టి షో మొత్తం చూసేస్తారు. అంతటి ప్రేక్షకాదరణ పొందిన ఈ రియాలిటీ షో కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 9'( Bigg Boss Telugu Season 9 ) త్వరలో ప్రారంభం కానుంది. కింగ్ అక్కినేని నాగార్జున ( Akkineni Nagarjuna ) హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ రియాలిటీ షోను సెప్టెంబర్ 7న గ్రాండ్‌గా లాంచ్ చేయనున్నట్లు సమాచారం. అయితే బిగ్ బాస్ 9లో పాల్గొనే కంటెస్టెంట్స్ వీరే అంటూ పేర్ల జాబితా బయటకు వచ్చింది. ఈ కంటెస్టెంట్స్ లిస్ట్ సోషల్ మీడియలో హల్ చల్ చేస్తున్నాయి.
ఈ కొత్త ఎడిషన్ సరికొత్త సర్ ప్రైజ్‌లు, ఊహించని ట్విస్టులు, ఆసక్తికరమైన టాస్క్‌లు, హై వోల్టేజ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించడానికి సిద్ధమవుతోంది. నిర్వాహకులు కూడా ఈసారి హౌస్ కోసం కొన్ని కొత్త రూల్స్‌ని ప్రవేశపెడుతున్నారని తెలుస్తోంది. ఇది షోపై మరింత ఆసక్తిని పెంచుతోంది. సామాన్యులను కూడా బిగ్ బాస్ హౌస్‌లోకి ఆహ్వానించనున్నారు. ఇప్పటికే, బిగ్ బాస్ అధికారికంగా ఆహ్వానం పలకడంతో, మేకర్స్‌కు లక్షలాది ఆడిషన్ వీడియోలు వచ్చాయి. ఇది షో పట్ల ప్రేక్షకులలో ఉన్న ఉత్సాహాన్ని తెలియజేస్తుంది. సామాన్యులు సెలబ్రిటీలతో కలిసి ఒకే ఇంట్లో ఎలా ఉంటారు, ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటారు అనేది ఆసక్తికరంగా మారనుంది.
బిగ్ బాస్ అభిమానులకు మరో షాకింగ్ న్యూస్ ఏమిటంటే, గ్రాండ్ ప్రీమియర్ షో ముగిసిన కేవలం మూడు రోజులకే బిగ్ బాస్ 9లో మొదటి ఎలిమినేషన్ జరగనుంది. ఇది ఆటను మొదటి నుంచే తీవ్రతరం చేసి, కంటెస్టెంట్స్‌లో ఒక భయాన్ని సృష్టించనుంది. తొలి వారం నుంచే పోటీ రసవత్తరంగా మారే అవకాశం ఉంది.
ఈ సారి బిగ్ బాస్ హౌస్ లో పాల్గొనే కంటెస్టెంట్స్ లిస్ట్ పై ఉత్కంఠ నెలకొంది. ఈసారి ఎవరు రాబోతున్నారు అనే దానిపై ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రతి సీజన్‌లాగే, ఈసారి కూడా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లిస్ట్‌పై తీవ్ర చర్చ జరుగుతోంది. ఇప్పటికే కొన్ని పేర్లు దాదాపు కన్ఫర్మ్ అయినట్లు సమాచారం. అందులో ముఖ్యంగా తేజస్విని గౌడ (సీరియల్ నటి), కల్పిక గణేష్ (నటి), అలేఖ్య చిట్టి (యూట్యూబర్), ఇమ్మానుయేల్ (జబర్దస్త్ కమెడియన్) స్వామి (ప్రముఖ ఆధ్యాత్మిక వ్యక్తి?), సుమంత్ అశ్విన్ (నటుడు), జ్యోతి రాయ్ (సీరియల్ నటి), ముఖేష్ గౌడ (సీరియల్ నటుడు), సాయి కిరణ్ (నటుడు) ఈ పేర్లు దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది.
వీరు కాకుండా ఈ జాబితాలో మరికొన్ని ఆసక్తికరమైన పేర్లు వినిపిస్తున్నాయి. వారిలో శ్రావణి వర్మ (సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్), ఆర్జే రాజ్, దేబ్ జానీ , రీతూ చౌదరి (సీరియల్ నటి), దీపిక (నటి), సీతాకాంత్ (నటుడు), హారిక (యూట్యూబర్), ఏక్ నాథ్ (సింగర్), రేఖా బోజ్ (నటి) ఉన్నట్లు సమాచారం. ఈ పేర్లన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇప్పటి వరకు ఈ షో నిర్వాహకులు అధికారికంగా కటెంస్టెంట్స్ లిస్ట్ ను ప్రకటించలేదు. అధికారికంగా ప్రకటించిన తర్వాతే దీనిపై స్పష్టత రానుంది.
గత సీజన్‌ల అనుభవాలను దృష్టిలో ఉంచుకొని, ఈసారి మేకర్స్ మరింత వైవిధ్యమైన, ఆసక్తికరమైన కంటెస్టెంట్స్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. నటులు, యాంకర్లు, యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లు, కమెడియన్లు, సామాన్యుల కలయిక ఈ సీజన్‌ను మరింత రసవత్తరంగా మార్చనుంది. సెప్టెంబర్ 7న గ్రాండ్ ప్రీమియర్ రోజున అసలు కంటెస్టెంట్స్ జాబితా తెలిసిన తర్వాతనే అసలైన సందడి మొదలవుతుంది. ఈసారి బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరు అవుతారో చూడాలి!