Coolie: చిరునవ్వు ఫేస్.. ఆకాశానికి తొక్కే మాస్‌.. ‌‌‌‌‌‌‌అనిరుధ్ అదిరిపోయే ‘పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హౌజ్‌‌‌‌‌‌‌‌’ సాంగ్

Coolie: చిరునవ్వు ఫేస్.. ఆకాశానికి తొక్కే మాస్‌.. ‌‌‌‌‌‌‌అనిరుధ్ అదిరిపోయే ‘పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హౌజ్‌‌‌‌‌‌‌‌’ సాంగ్

రజినీకాంత్ నుంచి వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘కూలీ’.లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్‌‌‌‌‌‌‌‌ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంబంధించి ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్‌‌‌‌‌‌‌‌ కంటెంట్‌‌‌‌‌‌‌‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రంలోని మరో పాటను తెలుగులో విడుదల చేశారు.

‘పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హౌజ్‌‌‌‌‌‌‌‌’పేరిట వచ్చిన ఈ పాటను పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్యాక్డ్‌‌‌‌‌‌‌‌గా కంపోజ్‌‌‌‌‌‌‌‌ చేశాడు అనిరుధ్.  అరివు అండ్‌‌‌‌‌‌‌‌ కోరస్ ఎనర్జిటిక్‌‌‌‌‌‌‌‌ వోకల్స్ ఇంప్రెస్ చేశాయి. ‘చిన్నారి చిరునవ్వు ఫేసురా.. ఆకాశానికి తొక్కు మాస్‌‌‌‌‌‌‌‌రా.. మనసును అతుక్కునే క్రేజ్‌‌‌‌‌‌‌‌ రా.. కు..కు..కూలీ పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హౌజే.. వీడంటే పిల్లలకైనా, పెద్దలకైనా, యువకులకైనా, యువతులకైనా ఎవ్వరికైనా లవ్‌‌‌‌‌‌‌‌సే.. కు..కు..కూలీ పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హౌజే..’అంటూ రజినీకాంత్‌‌‌‌‌‌‌‌ ఇమేజ్‌‌‌‌‌‌‌‌కు తగ్గట్టుగా రాంబాబు గోసాల రాసిన లిరిక్స్‌‌‌‌‌‌‌‌ ఆకట్టుకున్నాయి.  

నాగార్జున, ఆమీర్ ఖాన్, ఉపేంద్ర, సత్యరాజ్, శ్రుతిహాసన్‌‌‌‌‌‌‌‌,  సౌబిన్ షాహిర్ లాంటి స్టార్స్ కీలకపాత్రలు పోషించిన ఈ చిత్రం ఆగస్టు 14న విడుదల కానుంది. సన్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. డి. సురేష్ బాబు, దిల్ రాజు, సునీల్ నారంగ్, భరత్ నారంగ్ నేతృత్వంలో ఏషియన్ సంస్థ  తెలుగులో విడుదల చేస్తోంది.