యాదాద్రి భువనగిరి జిల్లాలోని .. స్వర్ణగిరి సెట్లో బాలాపూర్ గణనాథుడు

యాదాద్రి భువనగిరి జిల్లాలోని .. స్వర్ణగిరి సెట్లో బాలాపూర్ గణనాథుడు

ఎల్బీనగర్, వెలుగు: ఏటా లడ్డూ వేలంతోపాటు మండప సెట్టింగ్​లోనూ బాలాపూర్ గణనాథుడు తన ప్రత్యేకత చాటుతూనే ఉన్నాడు. గతేడాది అయోధ్య రామ మందిరంలో సెట్​లో భక్తులకు దర్శనమివ్వగా, ఈసారి యాదాద్రి భువనగిరి జిల్లాలోని స్వర్ణగిరి దేవాలయ నమూనా మండపంలో కొలువుదీరనున్నాడు. ఇందుకు సంబంధించిన పనులను శామీర్ పేటకు చెందిన కళాకారులు ప్రారంభించినట్లు బాలాపూర్ గణేశ్ ఉత్సవ సమితి అధ్యక్షుడు కళ్లెం నిరంజన్ రెడ్డి బుధవారం తెలిపారు. 

ఏటా కొత్త నమూనాతో ప్రజలను ఆకట్టుకునే బాలాపూర్ గణనాథుడు ఈ ఏడాది కూడా మరింత ఆకర్షణీయంగా ఉంటాడన్నాడు. ఉత్సవాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన వెల్లడించారు. కాగా, గతేడాది బాలాపూర్ లడ్డూ రూ. 30 లక్షలు పలికిన సంగతి తెలిసిందే.