Stocks To BUY: మోతీలాల్ ఓస్వాల్ కొనమన్న 5 స్టాక్స్.. 55 శాతం వరకు లాభం

Stocks To BUY: మోతీలాల్ ఓస్వాల్ కొనమన్న 5 స్టాక్స్.. 55 శాతం వరకు లాభం

Investment Ideas: దాదాపు వారం రోజులుగా దేశీయ స్టాక్ మార్కెట్లు ఎక్కువగా నష్టాలకు గురవుతూ ఒతిడొడుకుల్లో ట్రేడయ్యాయి. అయితే రెండు రోజులుగా పరిస్థితులు మెరుగుపడి బెంచ్ మార్క్ సూచీలు లాభాలతో క్లోజ్ కావటం కొంత ఉపశమనం కలిగిస్తోంది. ఈ క్రమంలో చాలా మంది ఏ స్టాక్స్ కొనాలి అనే దానికోసం వెతుకున్నారు.

దేశంలోని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ వివిధ రంగాలకు చెందిన 5 షేర్లను కొనుగోలుకు ఉత్తమంగా ఉన్నట్లు తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ఈ షేర్లలో 55 శాతం వరకు పెరుగుదల కనిపించవచ్చని, అందుకు గల కారణాలను పంచుకుంది. రియల్టీ, ఫార్మా, ఎఫ్ఎంసీజీ, ఎనర్జీ, ఇన్ ఫ్రా రంగాలకు చెందిన కంపెనీలను ఇందుకోసం సూచించింది. 

1. ముందుగా బ్రోకరేజ్ లోథా డెవలపర్స్ షేర్లకు బై రేటింగ్ ఇచ్చింది. స్టాక్ రానున్న కాలంలో 55 శాతం వరకు పెరిగి ఒక్కోటి రూ.1890 స్థాయికి చేరుకోవచ్చని వెల్లడించింది. కంపెనీ భారీగా ప్రీసేల్ బుక్కింగ్స్, రాబడులతో కొత్త ప్రాజెక్టులు వేగంగా ముందుకు సాగటం సానుకూల అంశంగా ఉన్నట్లు మోతీలాల్ చెబుతోంది. 

2. ఇక మోతీలాల్ రాడార్లో ఉన్న రెండవ స్థాక్ ఇన్ ఫ్రా రంగానికి చెందిన ఎల్ అండ్ టి. కంపెనీ షేర్లు రానున్న కాలంలో 20 శాతం వరకు పెరిగి ఒక్కోటి రూ.4వేల 200కి చేరుకోవచ్చని బ్రోకరేజ్ పేర్కొంది. కంపెనీ 76వేల కోట్లకు పైగా ఆర్డర్స్ కలిగి ఉండటం నమ్మకాన్ని పెంచినట్లు వెల్లడించింది.

3. బ్రోకరేజ్ ఎంచుకున్న మరో స్టాక్ వరుణ్ బెవరేజెస్. ఈ షేర్ రానున్న కాలంలో 21 శాతం వరకు పెరిగి రూ.620కి చేరుకోవచ్చని చెబుతూ బై రేటింగ్ అందించింది. కంపెనీ కొత్త ఉత్పత్తి కేంద్రాల విస్తరణ, పెరుగుతున్న మార్కెట్ ఆదాయాలను పెంచుతాయని మోతీలాల్ చెబుతోంది. 

4. బ్రోకరేజ్ అంచుకున్న మరో స్టాక్ గెయిల్. స్టాక్ ప్రస్తుతం ఉన్న రేటు కంటే 15 శాతం వరకు పెరిగి ఒక్కోటి రూ.210కి చేరుకోవచ్చని చెబుతూ బై రేటింగ్ అందించింది. టారిఫ్స్ పెంపు వార్తలతో స్టాక్ పెరగవచ్చని పేర్కొంది.

5. ఇక చివరిగా ప్రోకరేజ్ ఎంచుకున్న స్టాక్ పిరమిల్ ఫార్మా. మోతీలాల్ ఓస్వాల్ ఈ కంపెనీ షేర్లు 17 శాతం పెరిగి రూ.240 స్థాయికి చేరుకుంటాయని భావిస్తున్నట్లు అంచనాలను పంచుకుంది. 

NOTE: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటి ఆధారంగా ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోల్లో పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకోవటానికి ముందుగా మీ ఆర్థిక సలహాదారులను సంప్రదించటం ఉత్తమం. మీరు తీసుకునే నిర్ణయాలకు V6 యాజమాన్యం లేదా ఉద్యోగులు ఎట్టిపరిస్థితుల్లోనూ బాధ్యత వహించరు.