
తెలంగాణ రాష్ట్ర రవాణ శాఖ ఛార్జీలను పెంచింది. 2017 తర్వాత అంటే.. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఛార్జీలను రివైజ్ చేసింది ఆర్టీఏ. వెహికిల్స్ కు సంబంధించి వివిధ ఇక నుంచి వాహనదారులు అదనపు ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. లెర్నింగ్, ఫిట్‌నెస్, రిజిస్ట్రేషన్, పర్మిట్స్ తదితర అన్ని ట్రాన్సక్షన్స్‌కు సంబంధించి సర్వీస్ చార్జీలను రివైజ్ చేసింది. పెరిగిన ఛార్జీలు జులై 28 నుంచే అమలులోకి వచ్చాయి.
కొత్త రేట్ల ప్రకారం.. లైసెన్స్ సర్వీస్ ఛార్జీని రూ.200, మోటార్ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ ఛార్జీని రూ.300, నాన్ ట్రాన్స్ పోర్ట్ లైసెన్స్ కు రూ.400 వసూలు చేయనున్నారు. వీటితో పాటు రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా పెరిగాయి.
టూ వీలర్ వెహికిల్స్ కు రిజిస్ట్రేషన్ ఛార్జీలపై.. సర్వీస్ ఛార్జీని 0.5 శాతం పెంచారు. ఇక నాన్ ట్రాన్స్ ఫోర్ట్ త్రీవీలర్ వెహికిల్స్ రిజిస్ట్రేషన్ కు వెహికిల్ కాస్ట్ లో 0.1 శాతం పెంచినట్లు ఆర్టీఏ అధికారులు ప్రకటించారు. త్రీవీలర్ లో ట్రాన్స్ పోర్ట్ వెహికిల్స్.. ప్యాసెంజర్ ఆటో ఏడాదికి పైగా రిజిస్ట్రేషన్ కు 250 రూపాయలు పెరిగింది. ఆటో కాకుండా ఇతర ట్రాన్స్ పోర్ట్ వెహికిల్స్ కు ఏడాది లేదా అంతకు మించి రిజిస్ట్రేషన్ కు రూ.500 పెంచారు.
►ALSO READ | కీటకాలను తినే అరుదైన మొక్కలు .. తెలంగాణలో ఎక్కడ ఉన్నాయంటే.?
త్రీ వీలర్ ఆటో ఫిట్ నెస్ సర్టిఫికేట్ ఛార్జీ రెండేళ్లలోపు 200 రూపాయలకు పెంచారు. త్రీ వీలర్ కాకుండా ఇతర వెహికిల్స్ కు 300 కు పెంచారు.