
కొమురం భీం జిల్లా అడవుల్లో కీటకాలను తినే అరుదైన మొక్కలను గుర్తించారు అధికారులు. ఈ అరుదైనా మొక్కలను పెంచికాల్ పేట్, బేజ్జుర్ అడవుల్లో అరుదైన కీటక ఆహార మొక్కలుగా అటవీ శాఖ అధికారులు కనుగొన్నారు. వీటిని డ్రోసెరా బర్మనీ, యుట్రిక్లెరియా రకం వృక్ష జాతిగా గుర్తించారు. ఈ మొక్కల ఆకులపై ఉండే వెంట్రుకల లాంటి నిర్మాణాలు జిగురును స్రవిస్తాయి. ఇవి కీటకాలను ఆకర్షిస్తాయి. చిన్న చిన్న పురుగులు వాలగానే వాటిని బంధిస్తాయి . ఆ తర్వాత ఆ కీటకాలను జీర్ణం చేసుకుంటుందని తెలిపారు. అరుదైన కీటక ఆహార మొక్కలు పెంచికాల్ పేట్, బేజ్జుర్ రేంజ్ పరిధిలో కనిపించడం ప్రత్యేకమని అటవి శాఖ అధికారులు తెలిపారు..
డ్రోసెరా బర్మనీ (Drosera burmannii)
ఇది సండ్యూ కుటుంబానికి చెందిన మొక్క. దీని ఆకులపై చిన్న చిన్న వెంట్రుకలు ఉంటాయి, వాటి చివర జిగురు పదార్ధం (ముసిలేజ్) ఉంటుంది. ఈ జిగురు కీటకాలను ఆకర్షించి వాటిని పట్టుకుంటుంది. కీటకం చిక్కుకున్న తర్వాత ఆకులు లేదా వెంట్రుకలు నెమ్మదిగా కీటకం చుట్టూ మూసుకుని, జీర్ణక్రియను ప్రారంభిస్తాయి. ఇది స్టిక్కీ ట్రాప్ లేదా ఫ్లైపేపర్ ట్రాప్ అని పిలువబడుతుంది. కొన్ని జాతులలో, వెంట్రుకలు చాలా వేగంగా కదులుతాయి.
యుట్రిక్లేరియా (Utricularia)
ఇది బ్లాడర్‌వర్ట్ కుటుంబానికి చెందిన మొక్క. దీనికి ప్రత్యేకమైన బ్లాడర్ ట్రాప్లు ఉంటాయి. ఈ బ్లాడర్‌లు చిన్న సంచుల వలె ఉంటాయి, లోపల శూన్యంగా (వ్యాక్యూమ్) ఉంటాయి. బ్లాడర్ నోటి వద్ద చిన్న వెంట్రుకలు ఉంటాయి. అవి కీటకాన్ని (సాధారణంగా చిన్న నీటి కీటకాలు లేదా ప్రోటోజోవా) తాకగానే, బ్లాడర్ యొక్క తలుపు తెరుచుకుని, నీటితో సహా కీటకాన్ని లోపలికి పీల్చుకుంటుంది. ఇది చాలా వేగంగా జరిగే ప్రక్రియ.
డ్రోసెరా బర్మనీ సాధారణంగా తేమతో కూడిన నేలలు, చిత్తడి నేలలు, ఇసుక నేలలలో పెరుగుతుంది. యుట్రిక్లేరియా ఎక్కువగా నీటిలో (నీటిలో మునిగిపోయి లేదా నీటి ఉపరితలంపై తేలుతూ) లేదా చాలా తడి నేలల్లో పెరుగుతుంది