ఆదిలాబాద్ కాంగ్రెస్​ లో టికెట్ లొల్లి .. ఇప్పటికే ఇద్దరు కొత్తగా కంది

ఆదిలాబాద్ కాంగ్రెస్​ లో టికెట్ లొల్లి .. ఇప్పటికే ఇద్దరు కొత్తగా కంది
  • ప్యారషూట్ లీడర్లకు టికెట్ ఇచ్చేది  లేదంటున్న సీనియర్లు 
  • పాతోళ్లలో ఎవరికిచ్చిన కలిసి పనిచేస్తామంటూ ప్రకటన
  • మూడు వర్గాలుగా విడిపోయిన క్యాడర్​ 

ఆదిలాబాద్, వెలుగు:  ఆదిలాబాద్ కాంగ్రెస్​ లో ఆరు నెలల ముందుగానే అసెంబ్లీ  టికెట్ పంచాయతీ రచ్చకెక్కింది.  మొన్నటి వరకు డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, ఏఐసీసీ సభ్యురాలు గండ్రత్ సుజాత మధ్య టికెట్ పోటీ ఉండేది. ప్రస్తుతం కొత్తగా చేరిన కంది శ్రీనివాస్​ కూడా టికెట్ తనకే వస్తుందని ప్రచారం చేసుకుంటూ ప్రజల్లోకి వెళుతున్నారు. దీంతో నియోజకవర్గంలోని కాంగ్రెస్​ కార్యకర్తలు మూడు వర్గాలుగా విడిపోయారు.  బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన కంది శ్రీనివాస్ రెడ్డి వర్గం తయారు కావడంతో ఆదిలాబాద్ కాంగ్రెస్​ లో  జోరుగా చర్చ సాగుతోంది.  కాంగ్రెస్  నేతలతో కలిసి పోతారనుకున్నా కంది ఒంటిరిగా కార్యక్రమాలు చేపట్టడం..  

ఎమ్మెల్యే టికెట్ తనకే వస్తుందంటూ ప్రచారం చేస్తుండటంతో సీనియర్ నేతలు ఆయనపై ఆగ్రహంతో ఉన్నారు.  ఇటీవల మాజీ మంత్రి రాంచంద్రా రెడ్డి ప్రెస్​ మీట్ పెట్టి ఎమ్మెల్యే టికెట్ ప్యారషూట్ లీడర్లకు రాదంటూ స్పష్టం చేశారు.  డబ్బులున్నంత మాత్రాన ..  పార్టీ టికెట్ ఇవ్వదని చెప్పారు.   ఈ విషయంలో రెండు వర్గాలతో పాటు సీనియర్ నేతలు కందికి వ్యతిరేకంగా ఏకతాటిపైకి రావడం గమనార్హం.  బీజేపీలో ఉన్నప్పుడే సొంతంగా పార్టీ కార్యక్రమాలు చేయడంతో అక్కడా కందికి విభేదాలు తలెత్తాయి.  అనంతరం కాంగ్రెస్ లో  చేరిన పక్షం రోజుల్లోనే సీనియర్ నేతలకు దూరం కావడంతో టికెట్ విషయంలో చేస్తున్న ప్రచారం పార్టీలో ఆశావహులకు నచ్చడం లేదు.  దీంతో ఆయన్ను పక్కనపెట్టినట్లు తెలుస్తోంది.  బీజేపీలోనూ వచ్చిరాగానే సొంత వర్గం ఏర్పాటు చేసుకోవడం .. ఇప్పుడు కాంగ్రెస్ లోనూ అదే అవలంబిస్తుండటంతో ఆయన రాజకీయ భవిష్యత్ పై సోషల్ మీడియాలో కొంతమంది వ్యతిరేక పోస్టులు పెడుతున్నారు.  

ముగ్గురిలో ఒకరికి.. 

కాంగ్రెస్ నుంచి ఆదిలాబాద్ అసెంబ్లీ టికెట్ రేసులో ముగ్గురి పేర్లు వినిపిస్తున్నాయి. సాజిద్ ఖాన్, గండ్రత్ సుజాతతో పాటు మాజీ మంత్రి రాంచంద్రారెడ్డి అల్లుడు సంజీవ్ రెడ్డి  టికెట్  ఆశిస్తున్నారు. ఇదే విషయంలో ఇటీవల విలేకరుల సమావేశంలో ఈ ముగ్గురిలో ఎవరికి టికెట్ ఇచ్చినా కలిసి పనిచేస్తామంటూ ఆశవాహులు ప్రకటించడం గమనార్హం.  దీంతో పాత నేతలంతా ఒక్కటి కాగా.. కొత్తగా వచ్చిన కంది శ్రీనివాస్ రెడ్డి మాత్రం వీరికి దూరంగా ఉంటూ కార్యక్రమాలు చేసుకుంటున్నారు. అయితే తనకే టికెట్ వస్తుందంటూ ప్రచారం చేసుకోవడం వల్లే ఇక్కడ పాత నేతలందరూ ఐక్యతా రాగం వినిపించినట్లు తెలుస్తోంది. 

ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న తాము ఎప్పుడు ఇలా ముందస్తుగా ప్రచారం చేసుకోలేదంటూ వాపోతుండగా.. ప్రియాంక గాంధీ సమక్షంలో చేరిన కందికి టికెట్ ఇస్తారనే హామీతోనే పార్టీలోకి వచ్చారంటూ ప్రచారం జరుగుతోంది.  చాలా రోజుల తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొంటున్న రాంచంద్రరెడ్డి ఎవరికి చెబితే వారికి టికెట్ వస్తుందని పార్టీ వర్గల్లో చర్చ జరుగుతోంది. పాత నేతలంతా కలిసి రాంచంద్రరెడ్డిని కంది తీరును వ్యతిరేకించడంతో పాటు మళ్లీ ఆయన ఒంటరిగానే మిగిలిపోయారంటూ ప్రచారం చేస్తున్నారు. 

గడపగడపకు కాంగ్రెస్..

పాత నేతలంతా కలిసి గడప గడపకు కాంగ్రెస్ పేరుతో పార్టీ పూర్వ వైభవం కోసం ప్రయత్నిస్తున్నారు. టికెట్ అంశం పక్కన బెట్టి పనిచేయాలని అధిష్టానం సూచించడంతో ఆశవాహులు ముగ్గురు కలిసి ప్రచారం చేస్తున్నారు. ఈ ముగ్గురిని ముందుండి రాంచంద్ర రెడ్డి నడిపిస్తుండటం.. టికెట్ కావాలంటే పార్టీలో కనీసం ఐదేళ్లు పనిచేయాలని స్పష్టం చేయడంతో కంది శ్రీనివాస్ కు చెక్ పెట్టే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోపక్క శ్రీనివాస్ రెడ్డి మాత్రం తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. ఆయా గ్రామాల్లో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చే ఎన్నికల్లో పోటీలో ఉంటానంటూ ప్రచారం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాదిలోనే ఎలక్షన్లు ఉండటం.. ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ ప్రజల్లోకి వెళ్తున్న క్రమంలో ఇలా వర్గ విభేదాలు మరోసారి పార్టీని ఇరకాటంలో పెట్టినట్లవుతుందని రాజకీయ వ