పత్తిని నేరుగా ఎందుకు కొంటలేరు

పత్తిని నేరుగా ఎందుకు కొంటలేరు

ఖమ్మం టౌన్, వెలుగు: రైతుల నుంచి కమిషన్ దారులు లేకుండా నేరుగా ట్రేడర్లు పత్తిని ఎందుకు కొనుగోలు చేస్తలేరని సెంట్రల్ జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ సెల్వ వినోదిని ప్రశ్నించారు. నగరంలోని పత్తి యార్డ్ ను శుక్రవారం ఆమె విజిట్ చేశారు. మార్కెట్ విషయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఖమ్మం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆఫీస్ లో అధ్యక్షుడు చిన్ని కృష్ణ, సభ్యులతో సెల్వ వినోదిని సమావేశమయ్యారు. ఖమ్మంలోని 20 మంది పత్తి ట్రేడర్లు ఆర్సీఎం(రివర్స్ ఛార్జ్ మిషన్) కింద 2017 నుంచి 2019 వరకు చెల్లించాల్సిన రూ.20 కోట్ల సేల్ ట్యాక్స్ కు సంబంధించి జులై11న ఢిల్లీలో జరిగే జీఎస్టీ మీటింగ్​లో సంబంధిత ఆఫీసర్ నివేదిక అందించాలని సూచించారు. 

2017 నుంచి 2019 వరకు సేల్ ట్యాక్స్, పర్చేస్ కింద చెల్లించామని, ప్రభుత్వం ఆ టైంలో అవగాహన కల్పించక ఈ పొరపాటు జరిగిందన్నారు. ఇప్పుడు కోర్ట్ నోటీసులు రావడంతో ఆందోళన చెందామని తెలిపారు. ఆ నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్ట్ ను ఆశ్రయించినట్లు చెప్పారు. సమావేశంలో జిల్లా జీఎస్టీ ఆఫీస్ సూపరింటెండెంట్ రాజా రత్నాకర్ పాల్గొన్నారు.