15 వేలు లంచం తీసుకుంటూ దొరికిన ఏఈ

V6 Velugu Posted on Oct 14, 2021

ఎల్​బీ నగర్,వెలుగు: రిపోర్ట్ ఇచ్చేందుకు రూ. 15 వేలు లంచం డిమాండ్ చేసిన అసిస్టెంట్​ఇంజనీర్(ఏఈ) ఏసీబీకి పట్టుబడ్డాడు. నాగోల్ కు చెందిన ప్రదీప్ కుమార్ రెడ్డి ప్రైవేట్ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్, రాక్ టౌన్ కాలనీలో ఆనంద్ కుమార్ ఇంటికి వర్క్ కంప్లీషన్ ఫైనల్​ రిపోర్ట్ కోసం నెల కిందట నాగోల్ బండ్లగూడ ఎలక్ట్రికల్(టీఎస్‌ఎస్‌పీడీసీఎల్​)ఏఈ మధుకర్ కు అప్లై చేశాడు.  రిపోర్ట్ ఇవ్వకుండా తిప్పుకుంటూ రూ. 15వేలు లంచం ఇవ్వాలని ఏఈ మధుకర్​డిమాండ్ చేశాడు. ప్రదీప్​కుమార్ రెడ్డి ఏసీబీ అధికారులకు కంప్లయింట్​చేశాడు.  బుధవారం నాగోల్ లోని ఆఫీసులో ఏఈ మధుకర్ ను ఏసీబీ అధికారుల టీమ్ ​రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకుని కేసు నమోదు చేసింది. నిందితుడిని ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని ఏసీబీ డీఎస్​పీ సూర్యనారాయణ తెలిపారు. లంచం అడిగే వారిపై 1064  నంబర్ కు కాల్ చేయాలని కోరారు.

మరిన్ని వార్తలు

ఇంటర్.. ఫెయిలైనా పాస్​ మార్కులు!

Tagged Hyderabad, acb, bribe, LB NAGAR, Assistant engineer

Latest Videos

Subscribe Now

More News