ఏఎంవీఐ రాత పరీక్షకు హాల్​ టికెట్లు

ఏఎంవీఐ రాత పరీక్షకు హాల్​ టికెట్లు
  • ఇయ్యాల్టి నుంచి వెబ్​సైట్​లో అందుబాటులో: టీఎస్​పీఎస్సీ

హైదరాబాద్, వెలుగు: అసిస్టెంట్‌‌ మోటార్‌‌ వెహికల్‌‌ ఇన్‌‌స్పెక్టర్‌‌ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు బుధవారం నుంచి హాల్‌‌ టికెట్​లు డౌన్‌‌లోడ్‌‌ చేసుకోవచ్చని టీఎస్‌‌పీఎస్సీ తెలిపింది. బుధవారం ఉదయం 10 గంటలకు టీఎస్‌‌పీఎస్సీ వెబ్​సైట్​లో హాల్ టికెట్లను అందుబాటులో ఉంచుతామని కమిషన్ తెలిపింది. ఈ నెల 28న అసిస్టెంట్‌‌ మోటార్‌‌ వెహికిల్‌‌ ఇన్‌‌స్పెక్టర్‌‌ నియామక పరీక్ష జరుగనున్నది.

ప్రాక్టీస్‌‌ కోసం వెబ్‌‌సైట్‌‌లో మాక్‌‌ టెస్ట్‌‌కు సంబంధించిన లింకు అందుబాటులో ఉందని టీఎస్‌‌పీఎస్సీ సూచించింది.గత ఏడాది డిసెంబర్‌‌ 31న టీఎస్‌‌పీఎస్సీ 113 అసిస్టెంట్‌‌ మోటార్‌‌ వెహికిల్‌‌ ఇన్‌‌స్పెక్టర్‌‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌‌ జారీ చేసింది. ఆయా పోస్టులకు సంబంధించి జనవరిలో దరఖాస్తులు స్వీకరించారు. వాస్తవానికి ఏప్రిల్‌‌లో పరీక్ష జరగాల్సి ఉండగా.. పేపర్‌‌ లీకేజీ కారణంగా వాయిదా పడింది. ఈ క్రమంలో పరీక్షను జూన్‌‌ 28కి రీషెడ్యూల్‌‌ చేసింది.