
హైదరాబాద్, వెలుగు : వెటర్నరీ యానిమల్హస్బెండ్రీ డిపార్ట్మెంట్లో వెటర్నరీ అసిస్టెంట్సర్జన్ (క్లాస్ఏ అండ్ బీ)కి ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్లను జులై 4 నుంచి వెరిఫై చేయనున్నట్టు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) తెలిపింది. జులై 4 నుంచి 8 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతుందని శనివారం ఓ ప్రకటనలో టీజీపీఎస్సీ సెక్రటరీ నవీన్ నికోలస్ తెలిపారు.
జులై 3 నుంచి అభ్యర్థులకు వెబ్ ఆప్షన్ల కోసం లింక్‌ను అందుబాటులో పెడతామని చెప్పారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు ఎంపికైన అభ్యర్థుల వివరాలను టీజీపీఎస్సీ వెబ్సైట్లో పెట్టామన్నారు. సర్టిఫికెట్వెరిఫికేషన్కు వచ్చేటప్పుడు అన్ని ఒరిజినల్స్‌తో పాటు చెక్లిస్ట్ను విధిగా తీసుకురావాలని పేర్కొన్నారు.