హైదరాబాద్లో స్మార్ట్ డేటా సెంటర్లపై సదస్సు

హైదరాబాద్లో స్మార్ట్ డేటా సెంటర్లపై సదస్సు

హైదరాబాద్​, వెలుగు: అసోసియేటెడ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (అస్సోచామ్) స్మార్ట్ డేటా సెంటర్స్ క్లౌడ్ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్ సమిట్ నిర్వహించింది. ‘తెలంగాణను వేగవంతం చేయడం’ అనే అంశంపై హైదరాబాద్​లో గురువారం ఈ సదస్సు జరిగింది.

చీఫ్ ​గెస్టుగా వచ్చిన తెలంగాణ పరిశ్రమల శాఖ డైరెక్టర్ నిఖిల్ చక్రవర్తి  మాట్లాడుతూ రాష్ట్రంలో డేటా సెంటర్ ఆర్థిక వ్యవస్థ, డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన ప్రకటించారు.

ఏఐ , క్లౌడ్ టెక్నాలజీ, సైబర్ భద్రతపై సదస్సులో చర్చించారు.  అదానీ కనెక్స్, సిఫీ, కంట్రోల్ ఎస్ వంటి కంపెనీలు పాల్గొన్నాయి.   తెలంగాణ ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ మాట్లాడుతూ డిజిటల్ రంగానికి నిరంతరం విద్యుత్ సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.