
వచ్చే ఏడాది చంద్రునిపై రీసెర్చ్ చేయడానికి అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నానా చేపట్టనున్న ఆర్టెమిస్ మిషన్‌లో ఓ స్పెషల్ ఆస్ట్రోనాట్ భాగం కానుంది. ఆ ఆస్ట్రోనాట్ ఎవరో కాదు ఫేమస్ అమెరికన్ కామిక్ షో పీనట్స్‌లోని స్నూపీ. చార్లెస్ ఎం షుల్జ్ క్రియేట్ చేసిన స్నూపీ ఎన్నో యేండ్లుగా చిన్నారులను అలరిస్తోంది. అపోలో మిషన్స్ మొదలైనప్పటి నుంచి నాసాతో చార్లెస్ ఎం షుల్జ్, స్నూపీలకు అనుబంధం ఉంది. ఇంతకు ముందు కూడా స్నూపీ స్పేస్‌లోకి వెళ్లి వచ్చింది. ఇప్పుడు మళ్లీ ఆర్టెమిస్ 1 మూన్ మిషన్‌లో పార్ట్ కానుంది. 2022 మొదట్లో ఆస్ట్రోనాట్స్ లేకుండా చంద్రుని చుట్టూ తిరిగి వచ్చే ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్‌లో స్నూపీ వెళుతుంది. ఆ తర్వాత ఆస్ట్రోనాట్స్ తమ జర్నీని మొదలుపెడతారు. 1969లో అపోలో మిషన్‌లో పది మంది వ్యోమగాములతో ట్రావెల్ చేసిన స్నూపీ.. ఇప్పుడు సోలోగా ప్రయాణం చేయనుంది. ఓరియన్ ఎయిర్ క్రాఫ్ట్‌లో ఆస్ట్రోనాట్ చేసే పనులు చేసేలా జీరో గ్రావిటీతో స్పేస్‌లోకి వెళ్లేందుకు దీనికో సూట్‌ను కూడా రెడీ చేశారు. ఆరెంజ్ కలర్ డ్రెస్, వైట్ షూట్, బ్లాక్ ఇయర్స్‌తో ఈ ‘ఆస్ట్రోనాట్ స్నూపీ’ ఆకట్టుకుంటోంది. అన్‌క్రూడ్ ఫ్లైట్ టెస్ట్‌లో సిల్వర్ పిన్, పెన్ నిబ్‌లను కూడా స్నూపీ తీసుకెళుతోంది. చిన్నారులకు స్పేస్‌పై ఇంట్రెస్ట్ కలిగించేందుకు, అక్కడి పరిస్థితులు వివరించేందుకు ఇలాంటి డాల్స్‌ను స్పేస్‌లోకి తీసుకెళతారు. ఫస్ట్ టైమ్ రష్యా వ్యోమగామి యూరి గగారిన్ వోస్టాక్1లో ఒక బుల్లి బొమ్మను తనతో తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఔల్, యాంగ్రీ బర్డ్స్, ఓలాఫ్ బొమ్మలను కూడా స్పేస్‌లోకి తీసుకెళ్లారు.