ఐఎస్​ఎస్​ నుంచి క్షేమంగా తిరిగొచ్చిన నలుగురు ఆస్ట్రోనాట్లు

ఐఎస్​ఎస్​ నుంచి క్షేమంగా తిరిగొచ్చిన నలుగురు ఆస్ట్రోనాట్లు

కేప్​కెనవెరాల్ ​: ఇంటర్నేషనల్​ స్పేస్​ స్టేషన్​ (ఐఎస్​ఎస్​)లో ఆరు నెలల పాటు పరిశోధనల్లో పాల్గొన్న నలుగురు ఆస్ట్రోనాట్లు స్పేస్​ఎక్స్​ క్రూ క్యాప్సూల్​ ‘డ్రాగన్​’లో క్షేమంగా భూమ్మీదకు తిరిగొచ్చారు. తెలుగు మూలాలున్న ఇండియన్​ ఆరిజిన్​ఆస్ట్రోనాట్​ రాజాచారి, టామ్​ మార్ష్​బర్న్​, కేలా బారన్​, యూరోపియన్​ స్పేస్​ ఏజెన్సీ (ఈఎస్​ఏ)కి చెందిన మాథియాస్​ మారర్​లు.. గురువారం అర్ధరాత్రి దాటాక గల్ఫ్​ ఆఫ్​ మెక్సికోలో దిగారు. డ్రాగన్​ ల్యాండ్​ అయిన గంట తర్వాత క్యాప్సూల్​ నుంచి నలుగురు ఆస్ట్రోనాట్లు బయటకు వచ్చారు. కాగా, ఒక్క నెలలో స్పేస్​ఎక్స్​ చేసిన నాలుగో స్పేస్​ ప్రయోగం ఇది. రెండు ప్రయోగాల్లో స్పేస్​లోకి ఆస్ట్రోనాట్లను తీసుకెళ్లగా.. మరో రెండు ల్యాండింగ్​ ప్రయోగాలను సక్సెస్​ఫుల్​గా ఎలాన్​ మస్క్​ సంస్థ నిర్వహించింది. మొత్తంగా 26 మందిని స్పేస్​లోకి తీసుకెళ్లింది. అందులో 8 మంది ‘స్పేస్​ టూరిస్టులే’ కావడం విశేషం.