నెట్వర్క్, వెలుగు: భారతదేశ తొలి మహిళా ప్రధాని దివంగత ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా శుక్రవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆమె విగ్రహాలకు, ఫొటోలకు పలువురు నివాళులర్పించారు.
దమ్మపేటలో అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సంజీవరెడ్డి భవన్ లో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మాజీ ఎమ్మెల్సీలు పోట్ల నాగేశ్వరరావు, బాలసాని లక్ష్మీనారాయణ, పార్టీ నేత తుమ్మల యుగంధర్, నగర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నాగండ్ల దీపక్ చౌదరితోపాటు ఆయా చోట్ల పలువురు నాయకులు మాట్లాడారు.
మహిళా శక్తికి, ధైర్యసహసాలకు ఇందిరా గాంధీ ప్రతీకగా అభివర్ణించారు. ఆమె ఎన్నో విప్లమాత్మక నిర్ణయాలు తీసుకుని భారతదేశాన్ని ప్రపంచ పటంలో శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దారని కొనియాడారు.
