
యూపీలో ఇసుక మాఫియా రెచ్చిపోయింది. ఉద్దేశపూర్వకంగా 12 ఇసుక ట్రాక్టర్లతో టోల్‌ప్లాజా బారికేడ్లను గుద్దుకుంటూ వెళ్లిపోయాయి. కేవలం 52 సెకన్ల వ్యవధిలో 12 ట్రాక్టర్లు టోల్ ప్లాజాను దాటాయంటే అవి ఎంత వేగంగా వెళ్లాయో అర్థం చేసుకోవచ్చు. ఆదివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి సీసీటీవీలో రికార్డైన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
#WATCH | Uttar Pradesh: At least 12 sand-laden tractors, belonging to the sand mafia, break toll barricading and speed past, in Saiyan Police Station area in Agra on 4th September.
— ANI UP/Uttarakhand (@ANINewsUP) September 5, 2022
(Source: CCTV) pic.twitter.com/p2mfPseths
ఆదివారం ఆగ్రా – గ్వాలియర్ హైవేపై ఉన్న బజౌ టోల్ ప్లాజా వద్ద జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 12 ట్రాక్టర్లలో మొదటిది రోడ్‌బ్లాక్‌ను ఢీకొట్టి టోల్ చెల్లించకుండా వెళ్లిపోయింది. వెనుక వస్తున్న ఇతర ట్రాక్టర్లు దాన్ని అనుసరించాయి. టోల్ ప్లాజా సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేసినా డ్రైవర్లు ఎవరూ ఆగలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఆగ్రా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.