గ్రామీణ ప్రజల్లో మూఢవిశ్వాసాలు ఎంత బలంగా గూడుకట్టుకుపోయాయో చెప్పడానికి ఉదాహరణ ఈ ఘటన. మూఢ నమ్మకాలతో ప్రాణాలు తీయటం, కొందరు ప్రాణాలు తీసుకోవటం అక్కడక్కడా జరుగుతూనే ఉంది. లేటెస్ట్ గా మంత్రాల నెపంతో నిర్మల్ జిల్లాలో జరిగిన హత్య ఆందోళనకు గురిచేస్తోంది.
వివరాల్లోకి వెళ్తే.. నిర్మల్ జిల్లా కడెం మండలం వుండుంపూర్ పంచాయితీ పరిధిలో జరిగిన హత్య ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గండి గోపాల్పూర్ గ్రామానికి చెందిన దేశినేని భీమయ్య (55)ను అదే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు హత్య చేశారు. గ్రామానికి సమీప ప్రాంతంలో కర్రలతో కోట్టి హత్య చేశారు.
భీమయ్యను హత్య చేసిన వ్యక్తులు అంతటితో వదలకుండా కాల్చి బూడిద చేశారు. ఆధారాలు దొరకకుండా చేయాలనున్నారేమో.. ఎముకలు కూడా మిగలకుండా కాల్చేశారు. కాల్చిన ప్రాంతంలో బూడిద, కొంత భాగం మిగిలిన ఎముకలను చూసి గ్రామస్తులు ఆందోళనకు గరయ్యారు.
ALSO READ : బీఆర్ఎస్, బీజేపీ మధ్య చీకటి ఒప్పందం
ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు గ్రామస్తులు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించారు.

