V6 News

బీఆర్ఎస్, బీజేపీ మధ్య చీకటి ఒప్పందం : వెలిచాల రాజేందర్ రావు

బీఆర్ఎస్, బీజేపీ మధ్య చీకటి ఒప్పందం : వెలిచాల రాజేందర్ రావు
  • వెలిచాల రాజేందర్ రావు

కరీంనగర్ సిటీ, వెలుగు: మొదటి విడత సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు చీకటి ఒప్పందం చేసుకున్నాయని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌‌చార్జి వెలిచాల రాజేందర్‌‌‌‌రావు ఆరోపించారు. శుక్రవారం ఓ హోటల్‌‌లో మీడియాతో మాట్లాడుతూ కరీంగనగర్ రూరల్, కొత్తపల్లి పరిధిలోని 20 గ్రామాల్లో 11 కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు కైవసం చేసుకున్నారన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ నుంచి కేవలం 9 మంది అభ్యర్థులే గెలిచారని తెలిపారు.

 కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఒకరికొకరు సహకరించుకుంటున్నారని ఆరోపించారు. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ చరిత్రలోనే గత 10 ఏళ్లలో పార్టీకి ప్రాతినిధ్యం లేని గ్రామాల్లో సర్పంచులుగా గెలిచి రికార్డు సృష్టించామని అన్నారు.