మరో మూడు రోజులు GGH లోనే అచ్చెన్నాయుడు

మరో మూడు రోజులు GGH లోనే అచ్చెన్నాయుడు

ESI కుంభకోణంలో ACB అరెస్టు చేసిన మాజీ మంత్రి, తెలుగుదేశం ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు గతంలో ఆయనకు శస్త్రచికిత్స జరిగింది. అరెస్టయిన తర్వాత ఆయనను అధికారులు చాలా దూరం విజయవాడ వరకూ వాహనంలో తీసుకురావడంతో ఆపరేషన్ గాయం తిరగబెట్టడంతో ఆయనను చికిత్స నిమిత్తం GGHకు తరలించారు. ఆ గాయానికి చికిత్స అందిస్తున్నామన్నారు జీజీహెచ్ సూపరింటెండెంట్ సుధాకర్. అవసరమైతే మరోసారి ఆపరేషన్ చేస్తామన్నారు. గాయం తగ్గడానికి రెండు,మూడు రోజులు పట్టొచ్చని, బీపీకి ప్రస్తుతం వాడుతున్న మందులనే కొనసాగిస్తున్నామని, షుగర్ నార్మల్ గానే ఉందని తెలిపారు.

ఈఎస్ఐ మందుల కొనుగోళ్ల వ్యవహారంలో అవినీతి జరిగిందంటూ ఏసీబీ అధికారులు ఆయనను అరెస్టు చేసింది. దీనిపై కోర్టు ఆయనను 14 రోజుల రిమాండ్ కు ఆదేశించింది.