
మహారాష్ట్ర : గ్రామాల్లో ని పేషెంట్లకు మెంటల్ హెల్త్ సర్వీసులు అందటం అసాధ్యం. ఆ ప్రాంతాల్లో అదో సవాల్‌గా మారింది. దీంతోపాటు గ్రామాల్లో మానసిక వైద్య సామగ్రి, వనరులు ప్రాంతీయ భాషల్లో అంత ఈజీగా దొరకవు. అందుకే అక్కడ ఈ సర్వీసుల డెలివరీ ప్రశ్నార్థకంగా మారింది. ఈ అడ్డంకిని అధిగమించేందుకు ఎంహెచ్ ఐ.. పుణేలోని సెంటర్ ఫర్ మెంటల్ హెల్త్ లా అండ్ పాలసీ (సీఎంహెచ్ ఎల్ పీ) వంటి సంస్థలతో కలిసి పనిచేస్తోంది. ఈ ఆర్గనైజేషన్ .. ‘ఆత్మీయత’ అనే ప్రోగ్రామ్ ని నడుపుతోంది.
ఇందులో భాగంగా మెహ్ సనా జిల్లా (మహారాష్ట్ర)లోని 500 గ్రామాల్లో ఇప్పటికే ఉన్న కమ్యూనిటీ గ్రూప్ లీడర్లను కమ్యూనిటీ మొబిలైజర్లుగా మలిచేందుకు ట్రైనింగ్ ఇస్తోంది. తద్వారా కామన్ మెంటల్ డిజార్డర్లు ఉన్నవాళ్లకు ప్రైమరీ సపోర్ట్, కౌన్సెలింగ్ ఇప్పిస్తోంది. రేషన్ కార్డులు తదితర సోషల్ బెనెఫిట్స్ పొందటంలో సాయపడుతోంది. ముఖ్యంగా మానసిక ఆరోగ్య సవాళ్లతో పోరాడుతున్న వ్యక్తుల హక్కుల రక్షణకు ప్రయత్నించాలంటూ తన భాగస్వామ్య సంస్థలకు బోధిస్తోంది.