హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను గెలిపించుకోవాలని ఓటర్లను మంత్రి వివేక్ వెంకటస్వామి కోరారు. శుక్రవారం (నవంబర్7)సాయంత్రం ఓటర్లు, కార్యకర్తలతో సమావేశం అయిన మంత్రి.. నియోజకవర్గంలో 200 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. కాంగ్రెస్ గెలుపుతో నే అభివృద్ది జరుగుతుందన్నారు. గత పదేండ్లలో బీఆర్ ఎస్ ప్రభుతవం ఎలాంటి అభివౄద్ధి పనులు చేయలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. ఇప్పటికే 70 శాతం పనులు జరుగుతున్నాయన్నారు. నవీన్ యాదవ్ ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటే నియోజకవర్గ అభివృద్ధి జరుగుతుందన్నారు.
రాష్ట్రంలో బీఆర్ ఎస్ , బీజేపీ ఒక్కటయ్యాయని ఆరోపించారు మంత్రి వివేక్ వెంటకస్వామి. కాళేశ్వరంపై సీబీఐ ఎంక్వైరీ వేశాం.. ఇప్పటివరకు కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు.. బీఆర్ఎస్, బీజేపీ చీకటి ఒప్పందం వల్లే అరెస్ట్ కావాల్సిన బీఆర్ఎస్ నేతలు బయట తిరుగుతున్నారని విమర్శించారు. గతంలో బీఆర్ ఎస్ ప్రభుత్వం మాపై ఈడీ కేసులు పెట్టించింది. అయినా మేం లెక్కచేయలేదు. ఎన్నికల్లో హామీలు గుప్పించిన బీఆర్ ఎస్ ఒక్కటికూడా నెరవేర్చలేదు.. జూబ్లీహిల్స్ ప్రచారంలో కూడా ప్రజలను మభ్యపెట్టేందుకు చూస్తోంది.కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని మంత్రి వివేక్ వెంకటస్వామి కోరారు.
