క్రేజీ కాంబో .. రజినీకాంత్, సల్మాన్ ఖాన్‌‌ మల్టీ స్టారర్

క్రేజీ కాంబో ..  రజినీకాంత్,  సల్మాన్ ఖాన్‌‌ మల్టీ స్టారర్

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్,  బాలీవుడ్‌‌ టాప్‌‌ స్టార్ సల్మాన్ ఖాన్‌‌లను.. భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా ఉన్న  ప్రేక్షకులు ఆదరిస్తారు. ఈ ఇద్దరూ ఒకే ఫ్రేమ్‌‌లో కలిసి కనిపిస్తే.. ఇద్దరి  కాంబినేషన్‌‌లో సినిమా వస్తే అభిమానులకు అది పండుగే.  అతి త్వరలో వీళ్లిద్దరి కలయికలో సినిమా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.  తమిళ దర్శకుడు అట్లీ ఇందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.  గతేడాది షారుఖ్‌‌తో ‘జవాన్‌‌’ తీసి బాలీవుడ్‌‌కు బాక్సాఫీస్‌‌ హిట్‌‌ను ఇచ్చిన అట్లీ.. ఇప్పుడు సల్మాన్ ఖాన్ హీరోగా ఓ సినిమా తీసే ప్రయత్నంలో ఉన్నాడు.

అయితే ఇందులో నటించేందుకు రజినీకాంత్‌‌ను కూడా ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాడట అట్లీ.  సన్ పిక్చర్స్ సంస్థ ఈ క్రేజీ కాంబినేషన్‌‌ సినిమాను భారీ బడ్జెట్‌‌లో నిర్మించనుందట. ప్రస్తుతం సౌత్, బాలీవుడ్ స్టార్స్ కాంబినేషన్‌‌లో సినిమాలను ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.  ఆల్రెడీ రజినీకాంత్ సినిమా ‘వేట్టయాన్‌‌’లో అమితాబ్‌‌ కీరోల్ చేస్తున్న విషయం తెలిసిందే.  అలాగే ఎన్టీఆర్,  హృతిక్ కాంబినేషన్‌‌లో ‘వార్‌‌‌‌ 2’ తెరకెక్కుతోంది’. ఈ వారం ప్రేక్షకుల ముందుకొస్తున్న ‘కల్కి’లోనూ ఇటు సౌత్ అటు బాలీవుడ్ స్టార్స్ కలిసి నటించారు. అదే బాటలో రజినీ, సల్మాన్ సినిమా కూడా సెట్‌‌ అవుతుందేమో చూడాలి.!