
మెదక్, వెలుగు: మెదక్ పట్టణంలో శనివారం జరిగిన హత్య మిస్టరీ వీడింది. సొంత బావమరిదే హత్య చేసినట్టు పోలీసులు గుర్తించి నిందితుడిని అరెస్ట్ చేశారు. గాంధీనగర్ వీధికి చెందిన శ్రీనివాస్ (52) బిగ్ బజార్‌లోని కుట్టు మిషన్ రిపేర్ షాపులో పనిచేస్తున్నాడు. గాంధీనగర్‌కే చెందిన సోములవాడ సంతోష్ తన తండ్రికి చెందిన ఆస్తిని బావ శ్రీనివాస్ తనకు దక్కకుండా చేస్తున్నాడని కక్ష పెంచుకున్నాడు. ప్లాన్ ప్రకారం ఈనెల 20వ తారీఖున శ్రీనివాస్‌కు అతను పనిచేసే షాపులోనే ఎక్కువ మోతాదులో మద్యం తాగించి సుత్తెతో తలపై కొట్టి చంపేశాడు. విచారణలో సంతోష్ నేరం ఒప్పుకోవడంతో అరెస్ట్ చేశారు.