నుపూర్ ను హత్య చేసేందుకు కుట్ర పన్నిన టెర్రరిస్ట్ అరెస్ట్

నుపూర్ ను హత్య చేసేందుకు కుట్ర పన్నిన టెర్రరిస్ట్ అరెస్ట్

లక్నో : మాజీ బీజేపీ నేత నుపూర్ శర్మను హత్య చేసేందుకు కుట్ర పన్నిన ఓ టెర్రరిస్ట్ ను యూపీ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. నుపూర్ ను  చంపాలని అతనికి జైషే మహ్మద్ గ్రూప్ టాస్క్ ఇచ్చిందని అధికారులు తెలిపారు. నిందితుడు యూపీలోని సహరాన్‌పూర్‌లో ఉన్న కుండకాల గ్రామానికి చెందిన మహ్మద్ నదీమ్‌గా గుర్తించారు. మహ్మద్ నదీమ్‌కు జైష్- ఏ మహమ్మద్, తెహ్రీక్- ఈ- తాలిబాన్ గ్రూపులతో డైరెక్ట్ లింకులున్నాయని యూపీ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్‌ అధికారులు వెల్లడించారు.

వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్‌బుక్ మెసెంజర్, క్లబ్ హౌస్, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా అతను టెర్రరిస్ట్ గ్రూపులతో టచ్‌లో ఉన్నాడని తెలిపారు. ఫోన్‌ రికార్డులు, మెసేజ్‌ల ద్వారా అతను స్పెషల్ ట్రైనింగ్ కోసం పాకిస్తాన్‌ వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. అతని ఫోన్ లో పేలుడుకు సంబంధించిన కోర్సు పీడీఎఫ్ తో పాటు టెర్రర్ గ్రూపులతో చేసిన చాట్, వాయిస్ మెసెజులనుసేకరించామని పేర్కొన్నారు. అరెస్టయిన టెర్రరిస్ట్  దేశంలో ఉన్న  తన సహచరుల పేర్లను కూడా వెల్లడించాడని.. దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు.