చిలకనగర్ లో కార్పొరేటర్ భర్త వీరంగం

చిలకనగర్ లో కార్పొరేటర్ భర్త వీరంగం

హైదరాబాద్ : ఉప్పల్ 7వ డివిజన్ చిలకనగర్ లో కొత్తగా ఎన్నికైన టీఆర్ఎస్ కార్పొరేటర్ బన్నాల గీత భర్త ప్రవీణ్ వీరంగం సృష్టించాడు. శ్రీనివాస హైట్స్ లోకి వెళ్లి అక్కడి వారిని భయబ్రాంతులకు గురి చేశాడు. దీనికి సంబంధించి విజువల్స్ సీసీటీవీలో రికార్డయ్యాయి. అయితే ఈ ఘటనపై రెండు వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి.

శ్రీనివాస హైట్స్ లో ఉంటున్న రామరాజు ప్లాట్ కు కరెంట్ కట్ అయింది. దీనిపై అపార్ట్ మెంట్ అసోసియేషన్ పట్టించుకోలేదని తనకు సన్నిహితుడైన టీఆర్ఎస్ కార్పొరేటర్ భర్త బన్నాల ప్రవీణ్ కు చెప్పాడు రామరాజు. నిన్న అర్ధరాత్రి ప్రవీణ్ తన అనుచరులతో వచ్చి వీరంగం సృష్టించాడని ఆరోపించారు శ్రీనివాస హైట్స్ వాసులు. ప్రవీణ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే ఈ సంఘటనపై మాట్లాడిన ప్రవీణ్.. కాలనీ వాసులు కావాలనే తనపై తప్పుడు కేసు పెట్టారని ఆరోపించారు.