ఓడిపోతామనే నిరాశతోనే దళిత ఎమ్మెల్యేపై దాడి

ఓడిపోతామనే నిరాశతోనే దళిత ఎమ్మెల్యేపై దాడి

రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్

 

ఢిల్లీ: దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ భారీ మెజారిటీతో గెలవబోతోందని.. తాము ఓడిపోతున్నామనే నిరాశ, నిస్పృహతో మా దళిత ఎమ్మెల్యే క్రాంతిపై దాడికి పాల్పడడం సిగ్గుచేటు అని  టీఆర్ఎస్ నేత, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే క్రాంతిపై దాడి ఘటనను తీవ్రంగా ఖండిస్తూ పత్రికా ప్రకటన విడుదల చేశారు. సీఎం కేసీఆర్ ఆరేళ్లుగా  ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారని.. అందుకే గతంలో జరిగిన అన్ని రకాల ఎన్నికల్లో టిఆర్ఎస్ భారీ మెజారిటీతో గెలిచిందని ఆయన గుర్తు చేశారు. కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టు ను కట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందన్నారు. బీజేపీ నేతల దగ్గర పోలీసులకు దొరికిన డబ్బును కూడా వారి కార్యకర్తలే ఎత్తుకెళ్లారని ఆయన ఆరోపించారు. తెలంగాణలో మాకు ప్రజలే బాసులు అని ఆయన పేర్కొన్నారు. దుబ్బాకలో డబ్బును విచ్చలవిడిగా వెదజల్లి, ప్రజలను భయబ్రాంతులకు గురిచేసే ఘటనలకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. కేంద్రం నుండి తెలంగాణకు పెద్దగా సహాయం అందడం లేదు. మిషన్ కాకతీయకు 24 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ చెప్పింది.. పట్టించుకోలేదన్నారు. జీఎస్టీ నిధుల కోసం టీఆర్ఎస్ ఎంపీలం పార్లమెంట్ లో పోరాడినమని తెలిపారు. దుబ్బాక ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ పేర్కొన్నారు.