భూవివాదం.. అడ్వకేట్ పై దాడి.. అల్వాల్లో ఘటన

భూవివాదం.. అడ్వకేట్ పై దాడి.. అల్వాల్లో ఘటన

అల్వాల్, వెలుగు: భూవివాదంలో ఓ అడ్వకేట్​పై దాడి జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. అస్మత్ పేటలోని సర్వే నంబర్ 1లో స్థలం విషయంలో నగరానికి చెందిన న్యాయవాది మొయినుద్దీన్, ఇతరురులకు మధ్య వివాదం నడుస్తోంది. దీనిపై కోర్టులో కేసు నడుస్తోంది. ఆ స్థలంలో నిర్మాణ పనులు జరుగుతుండగా శుక్రవారం అడ్వకేట్​ మొయినుద్దీన్  అక్కడికి వెళ్లారు. 

ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఏర్పడడంతో న్యాయవాదిపై కొందరు దాడి చేశారు. ఆయన కారుపై రాళ్లు విసిరారు. అల్వాల్ పోలీస్ స్టేషన్​లో మొయినుద్దీన్ ఫిర్యాదు చేశారు. న్యాయవాది అసభ్య పదజాలంతో దూషించి తమపై దాడికి పాల్పడ్డారంటూ కొందరు మహిళలు, స్థానికులు కంప్లయింట్​ ఇచ్చారు. ఇరు వర్గాలపై పోలీసులు కేసు నమోదు చేశారు.