వ్యభిచారం చెయ్యాలని వేధింపులు: క్లబ్ డ్యాన్సర్ పై దాడి

వ్యభిచారం చెయ్యాలని వేధింపులు: క్లబ్ డ్యాన్సర్ పై దాడి

బేగంపేట్ లిస్బన్ క్లబ్ లోని ఓ డ్యాన్సర్ పై తోటి ఉద్యోగులు దాడి చేశారు. దీంతో పోలీసులను ఆశ్రయించింది బాధితురాలు. వివరాల్లోకి వెళితే.. బాధితురాలు సినిమాల్లో నటించాలనే కోరికతో హైదరాబాద్ కు వచ్చింది. అయితే సినిమాలలో అవకాశాలు రాకపోయేసరికి బేగంపేటలో ఉన్న కంట్రీ క్లబ్ లో డ్యాన్సర్ గా కుదిరింది. అక్కడే పని చేస్తున్న సిద్ధు అనే యువకుడు తన కోరిక తీర్చాల్సిందిగా చాలా రోజులనుంచి వేధిస్తున్నాడు. ఇందుకు తోటి మహిళా డ్యాన్సర్లు కూడా అతనికి సపోర్ట్ చేశారు.  అతని కోరికను బాధితురాలు తిరస్కరించగా.. ఆమెపై కక్ష పెంచుకున్నాడు సిద్ధు.

శుక్రవారం రాత్రి 2.30 నిమిషాలకు క్లబ్ ముగిసిన తర్వాత.. ఆ అమ్మాయి కృష్టా నగర్ లోని తన ఫ్లాట్ కు బయలు దేరింది. దీంతో ఆమెను సిద్ధు, అతని సహచరులు మధు, స్వీటీ, రితిక ఫాలో అయ్యారు. తోవలో ఆ అమ్మాయిని ఆపి తన కొరిక తీర్చాలని… దాంతోపాటే వ్యభిచారానికి ఒప్పుకోవాలని బెధిరించారు. రోజుకు 10వేల రూపాయలు వస్తాయని ఆశ చూపించారు. ఇందుకు ఆ అమ్మాయి ఒప్పుకోకపోవడంతో దాడి చేశారు సిద్ధు అండ్ గ్యాంగ్. వారి నుంచి తప్పించుకున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.